క్వారంటైన్ ఫిట్నెస్: ‘జుగాడ్’ వర్కౌట్ తో మతి పోగొడుతున్న.. ప్రీతీ జింటా !!..వీడియో చుడండి ..

Surya

 

ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన చొట్టబుగ్గల చిన్నది ప్రీతీ జింటా. ఈమె తెలుగు లో చేసింది బహుకొద్ది  సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా మిగిలి పోయింది. ఆమె క్రికెట్ టీమ్ "కింగ్స్ IX  పంజాబ్" తో బిజీ అయిపోయిన తరువాత సినిమాలు కాస్త తగ్గించేసింది. అయితే అప్పుడప్పుడు ఒకటో రెంటో సినిమాలు చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటూ ఉంది. అదేవిధంగా సినిమాలే కాకుండా పలు టీవీ షోస్ కి హోస్ట్ గాను మరియు జజ్డ్ గాను వ్యవహరిస్తోంది. ప్రస్తుత లాక్ డౌన్ లో  IPL  సీజన్ వాయిదా పడడంతో ప్రీతీ కాస్త సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ వుంది. తన కిష్టమైన పప్పితో పలురకాలుగా వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పంచుతూ వుంది.

 

తాజాగా ప్రీతీ తన హోమ్ క్వారంటైన్ లో చేసిన వ్యాయామం వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.  ఆ వీడియో కు ‘జుగాడ్’ వర్కౌట్ అని పేరుపెట్టింది. ఆ వీడియో లో నటి వ్యాయమ పరికరాలు లేనందున ఆమె ఇంటి పెరటిలో ఉన్న ఓ పోల్ ని సెలెక్ట్ చేసుకుంది. ఆ పోల్ కి రెసిస్టన్స్ బ్యాండ్ లను అమర్చి ఆ పోల్ కి  వ్యతిరేకంగా పంచ్ లు ఇవ్వడం స్టార్చేసింది. రెసిస్టన్స్ బాండ్శ్  ని చాలా చాక చక్యంగా వాడుతూ జిమ్ అవసరం లేకుండా వ్యాయామం చేస్తూ చూపరులను ఆకట్టుకుంది మన చొట్టబుగ్గల సుందరి.అయితే ఈ వ్యాయమ నియమాలను ఫిట్ నెస్ గురువు అయిన జోయ్ ఫెర్రవో నుండి స్వీకరించింది. గతం లో కూడా ఈమె పలు వ్యాయమ వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పుడప్పుడు తాను చేసిన వంటలను చూపించి నోరూరిస్తోంది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Finding different ways to stay fit during this quarantine. In simpler words this is what Jugaad looks like 🤩 #pzfit #lageraho #stayfit #staysane #ting

A post shared by Preity G Zinta (@realpz) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: