అన్న హీరోయిన్ కోసం తమ్ముడు ట్రయల్స్..!

VUYYURU SUBHASH

టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే లక్కీ హీరోయిన్ అనే విషయం అందరికి తెలిసిందే. అప్పుడెప్పుడో ఏడెనిమిది ఏళ్ల క్రితం సౌత్‌లో ఆమె కోలీవుడ్ హీరో జీవా ప‌క్క‌న మాస్క్ సినిమాలో న‌టించింది.  ఆ సినిమాలో ఆమెను చూసిన వాళ్లు అస‌లు ఈమెకు హీరోయిన్ అయ్యే ల‌క్ష‌ణాలు ఉన్నాయా ? అన్న సందేహించారు. ఎప్పుడు అయితే తెలుగులో వ‌రుస హిట్లు రావ‌డం స్టార్ట్ అయ్యిందో అప్ప‌టి నుంచి పూజా కెరీర్ మారిపోయింది. ఇక బాలీవుడ్ లోనూ త‌క్కువ టైంలో స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి ఛాన్సులు రావ‌డంతో పూజా హెగ్డే ఒక్క‌సారిగా నేష‌న‌ల్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. 

 

ఆమె సినిమాలు అన్నీ కూడా హిట్ కావడం తో ఆమె విషయంలో ఇప్పుడు కొందరు హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె సినిమాలు అన్నీ కూడా దాదాపుగా హిట్ అవ్వడం చూసి వేరే హీరోయిన్ లు కూడా షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది అని టాలీవుడ్ వర్గాల్లో గాసిప్ లు వ‌స్తున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె తో సినిమా చేయడానికి గానూ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అతని కెరీర్ లో రెండు మూడు సినిమాలు గట్టి షాక్ ఇచ్చాయి. 

 

ఇక తనకు క్రేజ్ లేదని అనుకున్నాడో లేక మరో కారణ౦ ఏంటీ అనేది తెలియదు గాని అతను మాత్రం ఇప్పుడు పూజ తో సినిమా చెయ్యాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అని సమాచారం. మరి ఆమె తో సినిమా అవకాశం వస్తుందో లేదో చెప్పడం కాస్త కష్టమే. ఆమె ఇప్పటికే శిరీష్ అన్న బన్నీ తో రెండు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మన తెలుగులో యువ హీరోలు ఎక్కువగా ఆమె తో సినిమా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చేస్తారా లేదా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: