పవన్ తిరస్కరణతో అభిమానులలో అసహనం !
పవన్ కళ్యాణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన ఒక్కరోజు గడవకుండానే పవన్ ఈ మూవీలో నటించే అవకాసం లేదు అంటూ లీకులు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు రెండు పూర్తి అయిన తరువాత కాని తన తదుపరి సినిమాల గురించి ఆలోచించను అని స్థిరంగా తనను కలిసిన వారితో చెపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో మళయాళం రీమేక్ లపై మెగా హీరోల ఆసక్తి బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ లో నటించడానికి అంగీకరించడంతో దర్శకుడు సుజిత్ ఈ మూవీ స్క్రిప్ట్ ను చిరంజీవికి సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ పై మళయాళ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ లో నటించమని ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ లాక్ డౌన్ పిరియడ్ లో పవన్ పై తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి పవన్ వరసపెట్టి సినిమాలు చేసే ఆలోచనలలో ఉన్నా ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ లో సినిమా షూటింగ్ లు ఆగిపోయిన పరిస్థితులలో పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ క్రిష్ దర్శకత్వంలోని సినిమాలు ఆగిపోవడంతో పవన్ కు ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ కథ బాగా నచ్చినా ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.
మళయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీలో ప్రిథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తే మరొక కీలక పాత్రలో మరో ప్రముఖ మళయాళ స్టార్ సూరజ్ వెంజారమూడ్ మరొక కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుత వ్యవస్థలో జరుగుతున్న అవినీతి చుట్టూ ఈ మూవీ కథ ఉంటుంది. ఈ మూవీ కథలో పవన్ ఒక మూవీ స్టార్ గా కనిపిస్తాడు. అయితే అతడి కారుకు లైసెన్స్ లేకపోవడంతో ఆర్ టి ఓ ఆఫీసులో తన డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఆఫీసర్ కు ఈ మూవీలోని హీరోకు జరిగే సంఘర్షణ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
వాస్తవానికి గతంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమాలో కూడ ఆర్ టి ఓ ఆఫీసులో జరిగే అవినీతికి సంబంధించి కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే కథనం రీత్యా ఆ కథకు డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధం లేకపోయినా మూలకథలో కొన్ని ఛాయలు కనిపిస్తాయి. దీనితో ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ తన బాడీ లాంగ్వేజ్ కి తన అభిమానులకు ఈ ‘డ్రైవింగ్ లైసెన్స్’ కథ నచ్చుతుందా లేదా అన్న విషయమై ప్రస్తుతం ఈ లాక్ డౌన్ పిరియడ్ లో పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్..