హంసా చిందేస్తే సినిమా హిట్టే

shami
పనికిరాని పది సీన్లలో కనిపించడం కంటే… దుమ్ము రేపే సాంగ్‌ చేస్తే ఒక్కటి చాలు అంటోంది ఓ ఐటమ్ గర్ల్. అన్నట్టే స్పెషల్ సాంగ్స్‌తో అదరగొడుతోంది. ఇండస్ట్రీలో టాప్ ఐటమ్ బాంబ్‌గా క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన చిందులేస్తున్న ఆ భామ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.హంసానందిని… హీరోయిన్‌ నుంచి ఐటమ్‌ గర్ల్‌గా షిఫ్ట్ అయిన భామ. వంశీ డైరెక్ట్ చేసిన అనుమానాస్పదం మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైందీ అమ్మడు. తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించినా… ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. చాలామంది హీరోయిన్లలాగే హంసానందినికి కూడా హీరోయిన్ క్యారెక్టర్లు కలిసి రాలేదు. అయితే అందరిలా ఇండస్ట్రీ నుంచి తప్పుకోకుండా తనకు సూటయ్యే ఐటమ్ గర్ల్ పాత్రలోకి మారిపోయింది హంస. ఇప్పుడు ఇండస్ట్రీలో నంబర్‌ వన్ ఐటమ్‌ బాంబ్‌గా సెటిల్ అయ్యింది. మిర్చి సినిమాలో ప్రభాస్‌తో ఐటమ్ సాంగ్ చేసిన హంసకు… ఆ తర్వాత ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. కనిపించింది రెండు నిమిషాలే అయినా… హంసానందిని క్రేజ్ అమాంతం పెంచేసింది మిర్చి టైటిల్ సాంగ్. హంసానందిని ఐటమ్‌ సాంగ్స్‌కు ఫేమస్ కావడంతో టాలీవుడ్‌లో ఐటమ్ గర్ల్స్ అందరూ ఫేడ్ అవుట్ అయ్యారు. ఈ ఆరడుగుల సుందరి దెబ్బకు వాళ్లకు ఆఫర్లే లేకుండా పోయాయి. వరుసగా టాప్ హీరోలందరితో ఐటమ్ సాంగ్స్ చేస్తున్న హంసే… ఇప్పుడు ఇండస్ట్రీలో నంబర్ వన్ ఐటమ్ గర్ల్. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్‌ పక్కన ఆడిపాడటంతో… హంసా నందిని క్రేజ్ మరింత పెరిగింది. దీంతో హంసానందిని ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్టే అని ఫిక్సయ్యింది ఇండస్ట్రీ. ఐటమ్ సాంగ్స్ భామగా ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న హంసానందిని… ఇప్పుడో భారీ ఆఫర్ కొట్టేసింది. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం బాలకృష్ణ లెజెండ్ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించబోతోంది. సింహా తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న లెజెండ్‌ మూవీపై భారీ అంచనాలున్నాయి. లెజెండ్‌ను కూడా సింహా రేంజ్‌లో హిట్ చేయాలన్నకసితో ఉన్న ఉన్నాడు బోయపాటి. దీంతో బాలయ్య కోసం ఓ స్పెషల్ సాంగ్‌ ప్లాన్ చేశాడు. ఈ పాటకు హంసానందిని అయితేనే కరెక్ట్‌గా సూటవుతుందని ఫిక్సయ్యాడట. హంస కూడా లెజెండ్ సాంగ్‌ తనకు బ్రేక్ ఇస్తుందని ధీమాగా చెప్తోంది. మొత్తానికి హీరోయిన్‌గా ఫెయిలైనా… ఐటమ్‌ గర్ల్‌ గా తనకొచ్చిన పేరు చూసి మురిసిపోతోంది హంసానందిని.  హంసా నందిని బాలయ్యతో చిందేస్తే ఎలా ఉంటుంది మీ స్పందన..? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: