యాంకర్ రష్మీ ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లాగవు..!!
తెలుగు బుల్లి తెరపై 'జబర్దస్త్ ' కామెడీ షో తో పరిచయం అయిన యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందం, అభినయంతో ఫుల్ మార్క్స్ కొట్టేసింది ఈ జబర్దస్త్ బ్యూటి. మరియు జబర్దస్త్‌లో తన హాట్ హాట్ అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారు మతులు పోగొడుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు ఢీ షోలో కూడా చేస్తున్న యాంకర్ రష్మీ బుల్లితెరపై భీభత్సమైన స్టార్ డమ్ సంపాదించుకొంది. అయితే ప్రతి ఆనందం వెనక ఓ బాధ ఉన్నట్టు యాంకర్ రష్మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడింది. ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తున్న రష్మీ ఒకప్పుడు ఒక్క అవకాశం అంటూ చెప్పులరిగేలా తిరిగింది.
సినిమాల్లో ఏ ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని ఆఫర్స్ కూడా ఇచ్చింది. దాసరి లాంటి దర్శకుడి సినిమాలో నటించిన తర్వాత కూడా రష్మిని తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు. దాదాపు పది ఏళ్ల పాటు నరకం చూసిందట రష్మీ. ఈ క్రమంలోనే ఏ ఆఫీస్ పడితే ఆ ఆఫీస్‌కు వెళ్లి ఫోటోలు ఇవ్వడమే కాకుండా ఆడిషన్స్ కూడా చేసింది. హోలీ, కరెంట్ లాంటి సినిమాల్లో నటించినా రష్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్నో బాధలు అనుభవించింది. అయితే అలాంటి టైమ్‌లో ఆమెకు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలో హోస్టింగ్ చేసే అవకాశం వచ్చింది.
దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. దాదాపు ఏడేళ్ల క్రితం మొదలైన రష్మి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ షోలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని హాట్ షోతో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక జబర్దస్త్ షో ద్వారా ఓ రేంజ్లో పాపులర్ అయిన రష్మీ.. సినిమాల్లోనూ నటిస్తోంది. ఐతే జబర్దస్త్‌లో హిట్టయినంతగా వెండి తెరపై ఆకట్టుకోలేకపోతోంది రష్మి. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించినా రావాల్సినంత క్రేజ్ మాత్రం రాలేదు. గుంటూర్ టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి వంటి సినిమాల్లో అందాల ఆరబోత చేసినా ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు. అయితే వెండితెరపై సక్సెస్ కాకపోయినా.. బుల్లితెర క్వీన్‌గా మాత్రం ఇప్పటికీ.. ఎప్పటికీ రష్మిని మించిన వాళ్లు లేరనే అంటుంటారు.