లవర్ బాయ్ లుక్ లో ఇస్మార్ట్ గా మెరిసిపోతున్న 'రామ్'

Murali

తొలి సినిమా దేవదాసుతోనే తనలోని యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు హీరో రామ్. ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో, డ్యాన్సులతో, రఫ్ గయ్ పాత్రలో మొదటి సినిమాతోనే మార్కులు కొట్టేశాడు. ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో రఫ్, క్లాస్, చబ్బీ, యూత్.. ఇలా అన్ని క్యారెక్టర్లకు సరిపోయే లుక్ రామ్ సొంతం. రామ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ 14 ఏళ్లలో ఈ తరహా పాత్రలెన్నో చేశాడు. రీసెంట్ గా చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీనే ఇందుకు నిదర్శనం.

 

 

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇప్పటి వరకూ లేని కెరీర్ బెస్ట్ లుక్ లోకి మారిపోయాడు రామ్. ఈ సినిమా నుంచి రామ్ లో డిఫరెంట్ లుక్స్ వచ్చేశాయి. ఇందుకు నిదర్శనమే తాను రీసెంట్ గా ఎలా ఉన్నాడో ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రామ్ లుక్ పూర్తిగా చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు. లవ్లీ లుక్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు. ఈ లుక్ తో మంచి లవ్ స్టోరీ పడితే బొమ్మ అదిరిపోద్ది అనే రేంజ్ లో ఉన్నాడు. ‘వేసవి వేడి తట్టుకోలేక పోతున్నాం. సూర్య తాపానికి మొహంలో కళే లేదు. ఇంట్లో ఉండాల్సిందే. హ్యాపీ వీకెండ్’ అంటూ తన వాల్ లో రాసుకున్నాడు.  

 

 

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ వేళ ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు రామ్. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్లోనే భారీ హిట్ కొట్టాడు రామ్. తన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ తో ఈ హిట్ లో తనకూ భాగస్వామ్యం ఉండేలా చూసుకున్నాడు. ప్రస్తతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన రెడ్ సినిమా విడుదల కావాల్సి ఉంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The {{RelevantDataTitle}}