బద్రి సినిమాకు ఫస్ట్ టైటిల్ ఇదే.... !
పవన్ కళ్యాణ్ బద్రి సినిమా రిలీజ్ అయ్యి సోమవారానికి 20 సంవత్సరాలు కావడం.. ప్రస్తుతం టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా ఉన్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాడం.. ఈ సినిమా ఎంతో మంది తలరాతలను మార్చి వారిని స్టార్లను చేయడంతో సోమవారం సోషల మీడియా అంతా బద్రి సినిమా.. పూరి జగన్నాథ్ గురించి ట్రెండ్ అయ్యింది. ఇక 2000 ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాను విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీస్ బ్యానర్‌పై టి. త్రివిక్రమ రావు నిర్మించారు. ఆయన అప్పటికే ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీశారు.
ముందుగా పూరి ఈ కథ రెడీ చేసుకుని ఆయనకు వినిపించగా.. ఆయన ఈ కథతో పవన్ కళ్యాణ్‌ను ఒప్పిస్తే తాను సినిమా తీస్తానని చెప్పారు. చివరకు చోటా కె. నాయుడు ద్వారా పూరి ఈ కథను పవన్‌కు వినిపించడం.. పవన్ ఈ కథ క్లైమాక్స్ ను మార్చమని చెప్పినా పూరి మాత్రం తాను క్లైమాక్స్‌ను మార్చనని.. కథపై ఎంతో నమ్మకం ఉందని చెప్పడంతో చివరకు అదే కథతో సినిమా తీశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ముందు నుంచే హిట్ టాక్ తెచ్చుకుని ఏకంగా 45 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పరిచయానికి ఈ సినిమానే నాందిగా నిలిచింది. ఈ సినిమాతో రేణు దేశాయ్ కథానాయికగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యింది. మోడలింగ్‌లో రంగంలో బిజీగా ఆమెను వెతుక్కుంటూ ముంబాయి వెళ్లి ఈ సినిమా కథ చెప్పి ఒప్పించాడు పూరి జగన్నాథ్. క హోనా ప్యార్ హై లాంటి సంచలన విజయం తర్వాత అమీషా పటేల్ నటించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు పూరి జగన్నాథ్ చెలి అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కానీ హీరో పేరు బద్రి కావడంతో ఆ పేరునే టైటిల్‌గా నిర్ణయించారు.
A small Story About @purijagan 20 years Journey of Cinema .. From my heart ❤️ pic.twitter.com/ys3eup8UKY — Raghu kunche (@kuncheraghu) April 20, 2020