సూపర్ స్టార్ రజినీకాంత్ - శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అన్నాథే. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో గోపించంద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని కొద్దీ రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గోపిచంద్ క్లారిటీ ఇచ్చాడు.రజినీ సినిమాలో నటిస్తున్నావట కదా అని కొంత మంది నా ఫ్రెండ్స్ అడిగారు. అది అంతా అబద్దం నేను ఆ సినిమాలో లేను ఆ సినిమా డైరెక్టర్ శివ నాకు మంచి మిత్రుడు అని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో గోపిచంద్ అన్నాడు.
ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న ఈ హీరో ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా, తెలంగాణ టీం కు కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి భూమిక చావ్లా , యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
కాగా సంపత్ నందితో గోపిచంద్ కు ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద నిరాశపరిచింది. ఇక సీటీమార్ తరువాత మరో సినిమాను లైన్లో పెట్టాడు గోపిచంద్. అందులో భాగంగా తేజ డైరెక్షన్ లో అలివేలుమంగ వెంకటరమణ లో నటించనున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చేఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.