సమంత అభిమానులకు శుభవార్త... కన్నడ రీమేక్ కు ఓకే చెప్పిన సామ్...!
అక్కినేని సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతోంది. ఈ మధ్య కాలంలో సమంత యూ టర్న్, ఓ బేబీ, జాను అంటూ పలు రీమేక్ చిత్రాల్లో నటించింది. యూ టర్న్, ఓ బేబీ సినిమాలు హిట్ కాగా జాను యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. సమంత నటిస్తున్న రీమేక్ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లు కాకపోయినప్పటికీ సమంత మంచి నటి అని ప్రూవ్ చేస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం సమంత నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ రీమేక్ లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమంత కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న దియా చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దియా రీమేక్ లో నటించమని సమంతను కోరగా సామ్ ఆ సినిమా చూసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఏ విషయాన్ని అయినా మనస్సులోనే దాచుకుని ఇబ్బందులు పడే ఒక యువతి ప్రేమలో పడిన తరువాత ఎలా మారుతుందనే కథాంశంతో దియా చిత్రం తెరకెక్కింది. అయితే సమంత దియా రీమేక్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకోనుందని... ఒక ప్రముఖ నిర్మాతతో కలిసి ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దియా రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు కర్ణాటక సంగీత విద్వాంసురాలు నాగరత్నమ్మ జీవిత చరిత్రను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించనున్నారని ఈ సినిమాలో సమంత నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. నాగచైతన్యతో వివాహం అయిన తరువాత సమంత ఎక్కువగా రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా రీమేక్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకెళుతోంది.