లాక్ డౌన్ ఎఫెక్ట్: దమ్‌ బిర్యాని తయారు చేసిన యాంకర్‌ శ్రీముఖి... ఇది య‌మా టేస్టీ గురూ..!

Suma Kallamadi

లాక్ డౌన్ వ‌ల్ల సెల‌బ్రెటీలంతా ఇల్లు వ‌దిలి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీస్‌కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.  ఈ హౌస్ అరెస్ట్ వ‌ల్ల‌.. వాళ్ల‌లోని కొత్త టాలెంట్ ఇప్పుడు అభిమానుల‌కు ప‌రిచ‌యం అవుతోంది. మొన్నామ‌ధ్య కాజ‌ల్ వంటింట్లో దూరి ఆమ్లెట్ వేసింది. సుమ పులిహోర చేసి ఊరించింది. ఇప్పుడు శ్రీ‌ముఖి చికెన్ బిర్యానీ వండి.. ఆహా అనిపించింది.

 

ప్రముఖ యాంకర్ శ్రీముఖిని మనం ఎప్పుడూ టీవీలో ఏదో ఒక ప్రోగ్రాంలో చూస్తుంటాం. ఆ మధ్య బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌ను అందించారామె. అయితే, ప్రస్తుతం లాక్‌డౌన్ సమయం నడుస్తుండటంతో ఇంటికే పరిమితమయ్యారు. టీవీ షూటింగ్‌లు ఆగిపోవడంతో క్వారంటైన్‌లో ఉన్న ఆమె తన పనులు తానే చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

 

శ్రీముఖి ఒక్కరోజు చికెన్ బిర్యానీ వండబోతున్నాను తెలియజేసింది. నాకు కుకింగ్ అంటే ఇష్టమని మీ అందరికీ తెలుసు. అయితే నా స్నేహితులు, నా సోషల్ మీడియా మేనేజర్ నన్ను ఒక కుకింగ్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టమని నాకు సలహాలు ఇచ్చారు.

 

కానీ నేను బిగ్ బాస్ హౌస్‌లో వంట చేయడం మీరంతా చూసారు. దీనిలో కొత్తేమీ లేదని నా ఫీలింగ్. కానీ రెసిపీవైజ్ వివరంగా కలపడం, వండటం మీరు చూడలేదు. కాబట్టి మీకు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను అని శ్రీముఖి చెబుతూ బిర్యానీ వండి చూపించారు.

 

ఈ చికెన్ బిర్యానీ చేయడానికి శ్రీముఖి ఒక ప్రత్యేక పాత్రను ఎంపిక చేసుకున్నారు. అందులో అయితే బాగా వస్తుందని ఆమె చెప్పారు. అలాగే, మసాలాలు కూడా ఊటీ నుంచి తీసుకొచ్చారట. మొత్తం మీద బిర్యానీ ఎలా చేయాలో చాలా వివరంగా, స్పష్టంగా చెప్పారు శ్రీముఖి. అయితే మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: