బోల్డ్ సీన్స్ లో నటించేందుకు హని పాప గ్రీన్ సిగ్నల్ !
హని పాపకు అసలు కలిసి రావడం లేదు. హని ఈజ్ ది బెస్ట్ అంటూ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన బొద్దుగుమ్మ మెహ్రీన్ ఫేట్ మాత్రం మారలేదు. ఎఫ్ 2 సక్సెస్ తర్వాత మెహ్రీన్ రేంజ్ మారిపోతుందేమో అనుుకుంటే రివర్స్ అయింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త ప్లాన్స్ చేస్తోందట.
కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మెహ్రీన్ పిర్జాదా కెరీర్ ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఒకటి రెండు హిట్స్ ఉన్న క్రేజీ హీరోగా కెరీర్ టర్న్ తీసుకోలేదు. డెడ్ ఎక్స్ ప్రెన్షన్ అంటూ విమర్శించిన వాళ్లకు ఎఫ్ 2 సినిమాలో హని పాత్రతో సమాధానం చెప్పింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ చబ్బీ బ్యూటీ పరిస్థితి మొదటికే వచ్చింది. దీంతో చేసేదేం లేక మెహ్రీన్ కూడా వెబ్ మూవీస్ సైడ్ ఫోకస్ చేస్తోందట.
ఎఫ్ 2 తర్వాత మెహ్రీన్ కు వరుసగా ఆఫర్లు క్యూకట్టాయి. అయితే ఈ బ్యూటీ నటించిన చాణక్య, ఎంత మంచి వాడవురా, అశ్వద్ధామా వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ లో వెబ్ సిరీస్ నటించేందుకు ప్లాన్ చేసుకుంటుందని టాక్. హాట్ హాట్ వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ సీన్స్ లో నటించేందుకు రెడీ అన్నట్టు హనీ పాప సిగ్నల్స్ ఇస్తోందట.
మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ఫిర్జాదా బాలీవుడ్ లో గిల్టీ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. దానికి మించి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పాపులారిటీతోనే గుర్ఫతే, తన అక్క మెహ్రీన్ కు ఓ వెబ్ సిరీస్ లో అవకాశం ఇప్పించినట్టు టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ ఎలా కనిపిస్తుంది.. బీటౌన్ జనాలను ఏ మాత్రం ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా మెహ్రీన్ లుక్ మారుతుందేమో చూడాలి.