తీవ్రమైన రచ్చగా మారిన ఆ స్టార్ హీరోల అభిమానుల కుమ్ములాట...సోషల్ మీడియాలో న్యూస్ వైరల్....!!
ఒకప్పటితో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో రకరకాల నూతన పద్ధతులు విధానాలు మరింతగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నాయి. దానివలన సినిమాల్లో క్వాలిటీ మరింతగా పెరుగుతూ ప్రజలను అవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటువంటివి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సినిమా పరిశ్రమలోని హీరోల అభిమానులు మాత్రం పరిస్థితులను బట్టి మారకుండా ఇంకా అలానే ఒకరిపై మరొకరు ద్వేషంతో విమర్శలు చేసుకోవడం కూడా ఎక్కువయింది. వాస్తవానికి ఒకప్పుడు అయితే ఈ సోషల్ మీడియా వంటివి లేకపోవడంతో థియేటర్స్ లేదా పలు కూడళ్ల వద్ద హీరోల అభిమానులు గొడవపడుతుండే వారు.
అయితే రాను రాను ఈ టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి వారు తమకు నచ్చని హీరోలపై ద్వేషంతో రగిలిపోతూ మీడియా వేదికల్లో కామెంట్స్ చేయడం పరిపాటి అయిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ ఫ్యాన్స్ పలువురు ఇతర హీరోల అభిమానులతో గొడవలు పడడం ఎక్కువ అయిందని, కొద్దిరోజుల క్రితం రజిని ఫ్యాన్స్ తో పాటు అజిత్ ఫ్యాన్స్ తో కూడా వారు గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడం జరిగింది. ఇక నేడు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివాదానికి దిగడంతో ఒకరి హీరోపై మరొకరు తీవ్ర విద్వేషంతో రగిలిపోతూ కామెంట్స్ చేసుకోవడం మొదలెట్టారు.
Ee retta phone endhi ra babu sudden ga switch off aithadhi
My reaction when phone switches off when u r in negative trend #Remakestarvijay pic.twitter.com/CSO4I2ugbA — .M9 (@SwagKhiladi) March 31, 2020
అంతటితో ఆగని ఆ ఇద్దరు హీరోల అభిమానులు, డమ్మీ స్టార్ మహేష్ బాబు అంటూ విజయ్ ఫ్యాన్స్ మహేష్ పై ట్రోల్ చేస్తుండగా, రీమేక్ స్టార్ విజయ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ పై ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. నిన్న సాయంత్రం నుండి ఈ ట్రోలింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ ట్విట్టర్ ట్రెండ్ లో ఇవి రెండూ కూడా ట్రెండ్ అయి పలువురిని దిగ్బ్రాంతికి లోను చేసాయి. వాస్తవానికి ఆ ఇద్దరు హీరోలకు బయట మంచి సఖ్యత ఉందని, కానీ వారి అభిమానులు మాత్రం ఈ విధంగా గొడవలు పడుతూ వారి స్థాయిని తగ్గించడం సరైనది కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!
பூமிகா மூஞ்சிய பாக்கும்போது
பிரகாஷ்ராஜ் கிட்ட மாட்னது விட
இந்த கிறுக்கன் கிட்ட மாட்டிடோமே'னு தான்டா தோனுது.. 😂😂#DummyStarMaheshBabu #Master pic.twitter.com/AfA0Psbncw — 🕶️ 👑 👿 (@Mr_Worst7) March 31, 2020