టాలీవుడ్ స్టార్ హీరోల‌ను మించిన పూజ రెమ్యున‌రేష‌న్‌... ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే..!

VUYYURU SUBHASH

తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవ‌రు ? అంటే అంద‌రి నోట్లో నుంచి వినిపించే పేరు ఒకే ఒక్క హీరోయిన్ పేరు. తెలుగులో ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతున్న కథానాయికగా పూజ హెగ్డే కనిపిస్తోంది. అప్పుడెప్పుడో నాగ చైత‌న్య ప‌క్క ఒక లైలా కోసం సినిమాలో న‌టించిన ప్పుడు ఆమెను అస్స‌లు ఎవ్వ‌రూ గుర్తు పెట్టుకోలేదు కూడా. ఆ త‌ర్వాత ఆమె వ‌రుస పెట్టి స్టార్ హీరోల ప‌క్క‌న న‌టిస్తూ హిట్లు మీద హిట్లు కొడుతోంది. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఆమె ను ప‌దే ప‌దే త‌మ సినిమాల్లో రిపీట్ చేయాల్సిన ప‌రిస్థితి.

 

చివ‌ర‌కు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు సైతం ప‌దే ప‌దే ఆమెను త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా రిపీట్ చేస్తున్నారు. ఇక వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు.. బ్లాక్ బ‌స్ట‌ర్లు పూజ కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేస్తున్నాయి. ఇక తెలుగులోనూ కాకుండా... అటు త‌మిళ్‌లో సైతం పూజ కెరీర్ ప‌రుగులు పెడుతోంది.. బాలీవుడ్‌లోనూ మంచి అవ‌కాశాలు అంది పుచ్చుకుంటోంది. అవ‌కాశం ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసు కోవాల‌న్న చందంగా పూజ రూటు మార్చేసింది.

 

వ‌రుస క్రేజ్‌ల అవ‌కాశాల నేపథ్యంలో పూజ పారితోషికాన్ని పెంచేసింది. అయినా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం అఖిల్ కంటే కూడా ఆమె ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంద‌న్న వార్త ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 

పూజా రేటు రు. 2-3 కోట్ల మ‌ధ్య‌లో ఉంటుంద‌ని టాక్‌. ఇప్ప‌టికే మూడు వ‌రుస ప్లాపుల‌తో ఉన్న అఖిల్ ఈ సినిమా కోసం త‌న రేటు బాగా త‌గ్గించుకున్నాడ‌ని కూడా అంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న ఆమె, చరణ్ తోను ఓ సినిమా చేయనుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: