తెలుగులో లేకపోతేనేం.. తమిళ్ లో ఉన్నాయిగా..!
ఒక్క హిట్ కెరీర్ ను మార్చేస్తుంది. జర్నీ జామ్ అంటూ దూసుకెళ్తుందని చెబుతారు. కానీ రెజీనా విషయంలో మాత్రం ఇది వర్కవుట్ కావడం లేదు. సక్సెస్ కొట్టినా తెలుగు మేకర్స్ మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. తమిళోళ్లు క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నా.. మనోళ్లు మాత్రం పక్కనపెట్టేస్తున్నారు. అంటే రెజీనాకు తెలుగునాట డోర్స్ క్లోజ్ అవుతున్నాయా..
రెజీనా ఎవరుతో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిగిటివ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే పెర్ ఫార్మెన్స్ లో ప్రశంసలు వచ్చినా.. అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో రెజీనాను తెలుగు మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వచ్చింది. ఇలాంటి టైమ్ లో ఓ తమిళ క్యారెక్టర్ తో కలిసి టాలీవుడ్ కు వస్తోంది రెజీనా.
రెజీనా ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. సెల్వ రాఘవన్, వెంకట్ ప్రభు లాంటి స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోలీవుడ్ లో క్రేజీ మూవీస్ చేస్తోన్నా.. తెలుగులో మాత్రం అవకాశాలు అందుకోలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించడానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ రాజుతో కలిసి వస్తోంది రెజీనా.
నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ చేయబోతోంది రెజీనా. అయితే తమిళ్ లో ఓకేగా ఉన్నా.. తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ఫ్లాప్ రేట్ ఎక్కువగా ఉండటమే కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ పరిస్థితులు చూస్తోంటే.. రెజీనాకు తెలుగులో డోర్స్ క్లోజ్ అయినట్టే కనిపిస్తోంది. మొత్తానికి రెజీనాకు తెలుగులో ఆఫర్స్ తగ్గినా.. తమిళ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగిసినట్టేనా అనే అనుమానం సినీజనాల్లో ఉంది.