నేహా ధూపియాను బండ బూతులు తిడుతున్నారు.. ఎందుకో తెలుసా?
ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా సాక్షిగా నోటికి ఏది పడితే అది మాట్లాడటం.. తర్వాత సంజాయిషీ చెప్పడం కామన్ అయ్యింది. ముఖ్యంగా లైవ్ ప్రోగ్రామ్ లో కొంత మంది సెలబ్రెటీలు టంగ్ స్లిప్ కావడంత.. తర్వాత సారీ చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఈ మద్యలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో ఎంత డ్యామేజ్ కావాలో అంతా అవుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా దూపియాను సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇంతకీ ఈ అమ్మడు చేసిన పని ఏంటా అని అనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా నేహా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే.. కొంత కాలంగా ఇండస్ట్రీలో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో నేహా దూపియా బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలోనే `నో ఫిల్టర్ విత్ నేహా` కార్యక్రమం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం `రోడీస్ రెవల్యూషన్` ప్రోగ్రామ్‌లో నేహ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ తో నేహా దూపియాకు మంచి ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఎంతో మంది సెలబ్రెటీలను ఈ ముద్దుగుమ్మ బోల్డ్ క్వచ్చన్లతో కంగారు పుట్టిస్తుంది. తాజాగా ఆమె పాల్గొన్న కార్యక్రమంలో ఒక పోటీదారుడు తన గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసం గురించి వెల్లడించాడు. తన గర్లఫ్రెండ్ తనతో పాటు మరో ఐదుగురు వ్యక్తులతో ఒకేసారి డేటింగ్ చేసిందన్నాడు.
ఈ విషయంలో తనను హెచ్చరించినా.. వినకుండా తనకే కౌంటర్ వేసిందని..దాంతో చిర్రెత్తుకొచ్చి ఆమె చెంపపై కొట్టానని అన్నాడు. అంతే ఆ వ్యక్తిపై నేహా దూపియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. `ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి ? ఎంత మందితో డేటింగ్ చేస్తే నీకేంటి ? అది ఆమెకున్న స్వేచ్ఛ. ఆమె స్వేచ్ఛను ప్రశ్నించడానికి నీవెవరు` అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసింది. అంతే నేహా దూపియా మాటలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యాయి.. స్వేచ్చ అంటే ఒక్కసారే ఎంత మందితో అయినా డేటింగ్ చేయొచ్చా అంటూ విమర్శిస్తున్నారు.