టాలీవుడ్‌కూ కరోనా ఎఫెక్ట్... కోట్లలో నష్టం.. రిలీజ్‌లు లేవు.. థియేటర్లు బంద్..!
ఇక కరోనా ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ? చర్చించేందుకు గురువారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో గల తెలుగు ఫిల్మ్‌చాంబర్‌లో ఇండస్ట్రీ పెద్దతు సమావేశమవుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇక కరోనా ప్రభావం వల్ల కొందరు స్థానికంగా షూటింగ్‌లు బంద్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి కొందరు ఇక్కడ షూటింగ్‌లు ఆపేసి.. విదేశాల్లో షూటింగ్‌లు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
మరి కొందరు నిర్మాతలు విదేశాల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండడంతో కొద్ది రోజుల వరకు షూటింగ్ లు బంద్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక షూటింగ్‌లు ఆగితే... కొద్ది రోజులు థియేటర్లు కూడా బంద్ అవుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ప్రజలు కిక్కిరిసి పోతారు. అక్కడ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉండడంతో ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారో ? అన్నది చూడాలి.
ఒక వేళ సినిమా షూటింగ్‌లు ఆలస్యమై.. రిలీజ్ లు వాయిదా పడి... థియేటర్లు కొన్ని రోజుల పాటు మూతపడితే ఇండస్ట్రీకి వచ్చే నష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కరోనా ఎఫెక్ట్ చివరకు టాలీవుడ్‌ను కూడా చిక్కుల్లో పడేసింది.