వార్నీ.. జిమ్ లో ఎంటమ్మా ఈ ఎరైటీ ఏసాలో.... దీపికా పడుకొనె ఫిట్ నెస్ వీడియో వైరల్..!

Edari Rama Krishna

హీరోయిన్ కావాల్సిన మొదటిలక్షణం ఎవరైనా చూడగానే అబ్బా అనిపించేంతలా శరీరాకృతి ఉండాలి. ఈ మద్య ఫిట్ నెస్ కోసం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జిమ్ ఇతర వ్యాయామ శాలల్లో వ్యాయాలు, యోగా చేస్తూ బాడీ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు.  ఇక సెలబ్రెటీల గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకంటూ ప్రత్యేకంగా ఓ జిమ్ ఏర్పాటు చేసుకొని కోచ్ తో తమ ఫిట్ నెస్ పై శిక్షణ తీసుకుంటారు.  ఇక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఎక్కువ కాలం కెరియర్ ఉండాలి అంటే నటనతో పాటుగా అందం ఉండటం కూడా చాలా ముఖ్యం. తెరపై అందంగా కనిపించినన్ని రోజులు మాత్రమే వారికీ అవకాశాలు అనేవి వస్తాయి. 

 

హీరోయిన్స్ ఫిట్ నెస్ లో ఏమాత్రం మార్పులు వచ్చినా.. లావెక్కినా.. హీరోయిన్స్ కెరియర్ అక్కడితో ముగిసినట్టే లెక్క.  ఇక ఫిట్‌నెస్‌ విషయంలో తగిన శ్రద్ద తీసుకుంటుంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే. ఈ భామ తన టైం టేబుల్‌లో జిమ్‌ వర్కవుట్స్‌ సెషన్‌ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంది. దీపికా తాజాగా జిమ్‌లో రోప్స్‌తో వర్కవుట్స్‌  చేస్తూ లుంగీ డ్యాన్స్‌  పాటకు  స్టెప్పులేసింది.  ట్రైనర్‌ సూచనలతో రోప్‌తో వ్యాయామం చేస్తోంది. ఆ సమయంలోనే ఆమె లుంగీ డ్యాన్స్‌కి రోప్‌ను అటూ ఇటూ ఆడిస్తూ డ్యాన్స్‌ చేసి, నవ్వులు చిందించింది.

 

ఈ వీడియోను ఆమె ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీపిక పదుకునేకు కష్టపడేతత్వంతో పాటుగానే సరదాగా ఉండే గుణమూ ఉందని ఆమె అన్నారు. ఆరు గంటల వ్యాయామం ఇలా గడిచిందని ఆమె చెప్పారు. దీపికా, షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలోని లుంగీ డ్యాన్స్‌ పాట ఏ రేంజ్‌ సూపర్‌హిట్టయిందో అందరికీ తెలిసిందే. కాగా, ఇటీవల దీపిక నటించిన 'ఛపాక్‌' చిత్రం విడుదలకు ముందు ఆమె జేఎన్యూలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలపడంతో విమర్శల పాలైంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#WeekendMotivation It's important to have fun too! @deepikapadukone has the perfect combination of working hard and having fun. This makes the 6 am mornings worth it 😉 #befitbecauseyoudeserveit #yasminfitnessmantra #BeFitwithYasminKarachiwala #CelebrityTrainer #YasminKarachiwala #DeepikaPadukone #FitnessGoals #FunctionalTraining #battleropes

A post shared by Yasmin Karachiwala (@yasminkarachiwala) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: