రాజశేఖర్‌ను మళ్లీ వాళ్లకు టార్గెట్ అయ్యాడా.. అంతు చూస్తామని వార్నింగ్.. ?
చిరు పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ చిరంజీవికి రాజకీయాలపై ఏమాత్రం అనుభవం లేదని.. ఆయన పాలిటిక్స్ లో విజయవంతం కాలేడని చెప్పి చిరు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత చిరు ఫ్యాన్స్ రాజశేఖర్ దంపతులు ప్రయాణిస్తోన్న ట్రైన్‌పై రాళ్లు విసిరారు. ఆ టైంలో మనస్థాపానికి గురైన చిరంజీవి.. అతని ఇంటికి వెళ్లి రాజశేఖర్ తో మాట్లాడి అంత సెట్ చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్ బాగానే ఉన్నా మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సమయంలో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అక్కడే ఉన్న చిరంజీవితోపాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలపై రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని చిరు నేరుగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేసాడు. ఇక రాజశేఖర్ అర్జున సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో ఓ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకోడానికి కాదు.. ఓడిపోగానే మూసుకునిపోవడానికి కాదురా మీ లాంటి వాళ్ళ తాట తీయడానికి అంటూ రాజశేఖర్ డైలాగ్ ఉంటుంది. దాంతో చిరును రాజశేఖర్ మరోసారి టార్గెట్ చేశాడని… అందుకే సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారని అంటున్నారు.
దీంతో మెగా అభిమానులు రాజశేఖర్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. రాజశేఖర్ అంతు చూస్తామని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. మరి ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.