కియారా న్యూడ్‌ స్టిల్‌ వివాదం.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన డబూ

JSR
ఇటీవల కియారా అద్వానితో డబూ రత్నాని తీసిని న్యూడ్‌ ఫోటో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన క్యాలెండర్‌ 25వ ఎడిషన్‌ సందర్భంగా డబూ ఈ ఫోటో షూట్ చేశాడు. అయితే ఈ షూట్‌లో కియారా ఇచ్చిన న్యూడ్‌ ఫోజ్‌ కాపీ అంటూ ఆరోపణలు వినిపించాయి. గతంలో ఇలాంటి ఫోటోనే తీసిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్‌ మేరీ బార్క్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో తాను గతంలో తీసిన ఫోటోకు తాజాగా డబూ రత్నాని తీసిన కియారా ఫోటోకు ఉన్న పోలికలను తెలియజేస్తూ తాను తీసిన ఫోటోను పోస్ట్ చేశాడు.


అయితే మేరీ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చాడు డబూ. 2002 క్యాలెండర్‌ కోసం 2001లో టబుతో తీసిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన డబూ, కియారా స్టిల్‌కు సంబంధించి కొంత గొడవ జరుగుతోంది. ఒకవేళ నేను మళ్లీ అదే కెమెరా వాడితే, నేను ఖచ్చితంగా నా కాన్సెప్ట్‌నే రిపీట్ చేస్తాను` అంటూ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు డబూ.

బాలీవుడ్ అందాల భామలు భూమీ పడ్నేకర్‌, సన్నిలియోన్‌, విద్యాబాలన్‌లు డబూ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది తొలిసారిగా విక్కీ కౌషల్‌, అనన్య పాండేలు డబూ క్యాలెండర్‌ షూట్‌లో తొలిసారిగా భాగమయ్యారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ గిల్టీ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రుచి నారాయణ్ దర్శకుడు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
🍃🍀💚 {{RelevantDataTitle}}