ఆర్ ఆర్ ఆర్ అవుట్ ఫుట్... ఈ పుకార్ల వెనక కథేంటి...!
ఇక ఈ సినిమా రీ షూట్ల విషయంలో వస్తోన్న వార్తలు ఇప్పుడు అందరిని గందరగోళంలో పడేస్తున్నాయి. ఈ సినిమాను కొంత భాగం రీషూట్ చేయనున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక గత యేడాది కాలంగా ఆర్.ఆర్.ఆర్ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా అది ఏదోలా వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న రామ్ చరణ్ సీన్లను రాజమౌళి రీ షూట్ చేస్తున్నాడని.. ఈ సీన్ల అవుట్ ఫుట్ సరిగా రాలేదని.. రషెస్ చూసిన చిరు సైతం ఈ సీన్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడన్న టాక్ అయితే బయటకు లీక్ అయ్యింది.
ఇక ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్‌లు ఏదోలా లీక్ అవుతూనే ఉన్నాయి. రామ్ చరణ్ రోల్‌పై బజ్ క్రియేట్ అయ్యేలా ఏ ఒక్క లుక్ లీక్ కాలేదు. దీంతో ఇది కూడా మెగా అభిమానుల్లో చిన్న పాటి అసహనానికి కారణమవుతోంది. అలాగే చరణ్ క్యారెక్టర్ విషయంలో రాజమౌళి కొంతమేర వర్క్ చేసి రీషూట్ కు సిద్దమవుతున్నాడని కూడా అంటున్నారు. వినయ విధేయ రామ సినిమాలో సైతం రషెస్ చూసిన చిరుకు కొన్ని సీన్లు నచ్చక పోయినా చిరు రాజీ పడడంతో సినిమా ప్లాప్ అయ్యింది.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా కావడంతో చిరు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. అయితే నిజంగా రాజమౌళికి సలహాలు ఇచ్చేంత ధైర్యం చిరు చేస్తాడా ? అన్నది కూడా సందేహమే కదా... ఈ పుకార్లను పూర్తిగా నమ్మడానికి వీలు లేదు.