రావణుడెవరు..? వెంకట రమణ ఎవరు..? సస్పెన్స్‌లో రానా, గోపిచంద్ క్యారెక్టర్స్!
శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు తేజ. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.
ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన తేజ మరోసారి అదే హీరోలతో మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే రానాతో రాక్షస రాజ్యంలో రావణాసురుడు, గోపిచంద్‌తో అలిమేలు వంగ వెంకట రమణ సినిమాలు తెరకెక్కించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.