రానా సినిమా బడ్జెట్ భారీగా తగ్గించారట.. కారణం..?

praveen

దగ్గుబాటి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రానా... వైవిధ్యమైన పాత్రల్లో  నటించి విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ప్రస్తుతం రానా అరణ్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో రానా అడవి మనిషి గెటప్ లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. అయితే అరణ్య సినిమాతో పాటు రానా వరుస సినిమాలను చేయనున్నారు. అరణ్య సినిమా తర్వాత హిరణ్యకశ్యప సినిమాలో నటించనున్నారు దగ్గుపాటి రానా. 

 

 

 త్వరలో హిరణ్యకశిప సినిమా పట్టాలెక్కింది. అయితే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. బాల రామాయణం రుద్రమదేవి వంటి ఎన్నో చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎంతో గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా విషయంలో గుణశేఖర్ పక్క ప్లానింగ్ తోనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే గుణశేఖర్ సినిమాలంటే భారీ బడ్జెట్ తో కూడుకుని ఉంటాయి అని తెలిసిందే. ఈ క్రమంలోనే హిరణ్యకశిప సినిమా కోసం 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. 

 

 

 అయితే ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయాలని భావించిన దర్శక నిర్మాతలు 180 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ని అనుకున్నారట . కానీ ఇప్పుడు ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారట దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. అయితే ఒక్కసారిగా భారీగా బడ్జెట్ ఎందుకు తగ్గించారు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.బడ్జెట్  తగ్గించిన విషయం నిజమా కాదా అన్నది తెలియాలంటే చిత్రబంధం నుండి సమాచారం అందాల్సిందే.  ఏదేమైనా ప్రస్తుతం ఇదే విషయం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: