అందుకే రష్మిక.. లక్కీ హీరోయిన్ !
హీరోయిన్లు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కావాలంటే కమర్షియల్ సినిమాలు వదిలేయాలి. కమర్షియల్ హిట్ కావాలంటే పెర్ఫాామెన్స్ ని లైట్ తీసుకోవాలి అంటారు. కానీ రష్మిక మందనకు మాత్రం ఒకే సినిమాతో రెండూ వస్తున్నాయి. కమర్షియల్ కథల్లోనూ టాలెంట్ చూపించుకునే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. దీంతో రష్మిక లక్కీ లేడీగా మారుతోంది.
రష్మిక మందన రీసెంట్ గానే మీకు అర్థమవుతోందా.. అంటూ సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టింది. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనిపించే కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీని పడేసింది. ఈ ఊపులోనే భీష్మ సినిమాలో చైత్ర అనే ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఓ వైపు స్ట్రిక్ట్ మరోవైపు గ్లామర్ ఉన్న ఈ క్యారెక్టర్ తో జనాలను మాయ చేస్తోంది.
రష్మిక మందన గీత గోవిందం సినిమాతో యూత్ కు ఫుల్ గా కనెక్ట్ అయింది. ఈ మూవీలో రష్మిక ఆటిట్యూడ్ కు దర్శకులు కూడా ఫిదా అయ్యారు. భారీ సినిమాల్లో అవకాాశాలు ఇస్తున్నారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూాడా ఈ పెర్ఫామెన్స్ కు ఇంప్రెస్ అయ్యారు. ఈ బ్యూటీతో స్టెప్పులేస్తున్నారు.
రష్మిక మందన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ ప్లాట్ ఫామ్ లోనే వచ్చాయి. కానీ వీటిల్లో రష్మిక కేవలం గ్లామర్ గిరికే పరిమితమైపోలేదు. పెర్ఫామెన్స్ చూపించింది. అన్ని సినిమాల్లో తనదైన మార్క్ చూపించింది. ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయిన డియర్ కామ్రేడ్ లోనూ క్రికెటర్ గా స్ట్రాంగ్ రోల్ ప్లే చేసింది. అందుకే పెర్ఫామెన్స్, గ్లామర్ కలిసున్న క్యారెక్టర్స్ చేస్తోన్న రష్మికను లక్కీ లేడీ అంటున్నారు.
మొత్తానికి రష్మిక మందన ఫుల్ గ్లామర్ క్యారెక్టర్స్ తో సినీ అభిమానులను తనవైపు తిప్పుకుంటోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయిపోయింది.