భీష్మ: ఫస్టాఫ్ సూపర్... సెకండాఫ్ డబుల్ సూపర్..!
నితిన్ భీష్మ ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. సినిమా చూసిన వాళ్లు బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు. ఇక సినిమా ఫస్టాఫ్... సెంకడాఫ్ అని తేడా లేకుండా కుమ్మేసిందంటున్నారు. ఫస్టాఫ్ అంతా ఒకే అనిపించే నరేషన్ తో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ మరియు ఇంటర్వెల్ లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
ఫస్టాఫ్‌లో నితిన్.. రష్మిక మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ ట్రాక్‌తో పాటు నితిన్ - వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కూడా అదిరింది అంటున్నారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారట. సెకండాఫ్‌లో కామెడీ సీన్లు అయితే ఒక దానిని మించి మరొకటి ఉండేలా డైరెక్టర్ వెంకీ డిజైన్ చేశాడని అంటున్నారు. ఇలా కామెడీ మాత్రం సెకండాఫ్ లో మంచి ఎస్సెట్ గా నిలుస్తుందట. నాగశౌర్యతో ఛలో సినిమాను తెరకెక్కించి... కామెడీతో అద్భుతమైన మ్యాజిక్ చేసిన వెంకీ కుడుముల ఈ సినిమాలోనూ అదే పంథాను ఫాలో అయ్యాడంటున్నారు.
అయితే సినిమా కథ మాత్రం మరీ కొత్తగా లేదని.. మనం గతంలో చూసిన సినిమాల తరహాలోనే ఉందని.. అయితే దీనికి దర్శకుడు వెంకీ రాసుకున్న ట్రీట్మెంట్తో పాటు తెరపై ప్రజెంట్ చేసిన విధానం సూపర్ అని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఫస్టాప్.. సెకండాఫ్ రెండూ బాగున్నా.. ఫస్టాఫ్ కంటే సెంకడాఫ్ మరింత సూపర్ అంటున్నారు. సెకండాఫ్ పై పెట్టిన శ్రద్ద ఫస్టాఫ్ పై మిస్సయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. అలాగే మహతి అందించిన పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్ గా బాగున్నాయి.అలాగే సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.