ఇల్లీ బేబీ.. ఇలా అయితే కష్టమే..?
టాలీవుడ్ లో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన వొంపు సొంపులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా తెలుగు, తమిళ్ లో ఛాన్సులు వచ్చాయి. టాప్ హీరోల సరసన నటిస్తూ వచ్చిన ఇలియానా అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయ్యింది. దాంతో బాలీవుడ్ లోకి జంప్ చేసింది. అయితే అక్కడ మాత్రం ఇల్లీ బేబీకి బ్యాడ్ లక్ మొదలైంది. చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో తిరిగి తెలుగు లోకి రావాలనుకున్నా అప్పటికో కొత్త హీరోయిన్లు తమ జోరు కొనసాగించడం మొదలు పెట్టారు.
అంతలోనే ఇల్లీ బేబీ ఓ విదేశీయుడిని ప్రేమించడం.. బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఫిజిక్ విషయంలో అశ్రద్ద చూపడంతో లావెక్కిపోయింది. క మళ్ళీ సినిమాలే మేలు అందులోను లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమానే బెటర్ అని రవితేజ సరసన 'అమర్ అక్బర్ అంథోని' లో నటించింది ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ ఎలాగైనా సినిమాల్లో రావాలని జిమ్ కెళ్ళి కష్టపడింది. ఇంతకుముందులా బాడీ ఫిట్ లుక్ ఇప్పుడు లేదు. కాస్త బొద్దుగానే కనిపిస్తుంది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే క్రమంలో ఇలా లావెక్కి పోవడం పై విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ మద్య ఏ డిజైనర్ డ్రెస్ వేసినా తన పర్సనాటిలీ ఇట్టే బయటపడిపోతోంది. తాజాగా డెనిమ్ స్లిట్ స్కర్టులో ఫొటోగ్రాఫర్ల కంట పడింది ఇలియాన ఈ ఫొటోల్లో మళ్ళీ బొద్దుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా అయితే సినిమాల్లో ఎలా సక్సెస్ సాధిస్తావ్ ఇల్లీ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలియానా అభిమానులు. మరి ఇప్పటికైనా తన పర్సనాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.