షూటింగ్స్ తో బిజీ బిజీగా పవన్..
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత తన పవర్ ఫుల్ యాక్షన్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు పవన్ కళ్యాన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’చిత్రం తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లిన పవన్ కళ్యాన్ గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. కానీ పవన్ కళ్యాన్ అంచనాలు తల కిందులు అయ్యాయి. తాను పోటీ చేసిన రెండుస్థానాల్లో ఓడిపోయారు. ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీ వైపు వచ్చారు. ప్రస్తుతం పింక్ మూవీ రిమేక్ లో నటిస్తు్న్నారు పవన్ కళ్యాన్. ఒక రోజు రాజకీయం మరో రోజు సినిమా అన్నటు పవన్ పని చేసుకుంటూ పోతున్నారు.
ఇక వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసిన పవన్ ఆ సినిమా షాట్ లలో పాల్గొంటున్నారు. ముందుగా పింక్ సినిమాను పూర్తి చేసి.. ఆతర్వాత క్రిష్ సినిమా, ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమా చెయ్యాల్సి ఉంది. పవన్ కళ్యాన్ ని రాజకీయాల్లో చూసి బోర్ ఫీల్ అవుతున్న అభిమానులు ఇప్పుడు వెండి తెరపై చూడాలని తెగ ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం సంగీతం విషయంలో థమన్ ఎంతో శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాన్ లుక్ పరంగా కూడా చాలాజాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఒక సామాన్యమైన లాయర్ ఎలా ఉండాలి..ఆయన స్టైల్లో చూపించబోతున్నారట. ఇక ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కోర్ట్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ షూటింగ్ 30 న తేదీ వరకు సాగనుంది. ఆ తర్వాత మిగిలిన పార్ట్ ను మార్చి 20నుంచి షూట్ చేయనున్నారు. మరోవైపు క్రిష్ చిత్రం షూటింగ్ మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరుగనుంది. ఇలా పవన్ తన షూటింగ్ లను ప్లాన్ చేసుకున్నారు .