అల్లు అర్జున్ మూవీ బాలీవుడ్ రిమేక్ కాబోతుందా..?
అల వైకుంఠపురములో బాలీవుడ్ రిమేక్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ రిమేక్ లో నటించేందుకు బీటౌన్ బడా స్టార్ ఇంట్రెస్ట్ చూపుతున్నారట. ఒకరు మూవీ రైట్స్ అమ్మేద్దామని క్యాష్ ప్లాన్ చేస్తుంటే.. మరొకరు రిమేక్ చేసి భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురములో నాన్ బాహుబలి రికార్డ్ గా నిలిచింది. అల్లు అర్జున్ ను ఈ సినిమా పర్ఫామర్ గా కమర్షియల్ గా మరో మెట్టు ఎక్కించింది. పూజా హెగ్డే గ్లామర్, తమన్ సంగీతం, త్రివిక్రమ్ మార్క్ అల వైకుంఠపురములో సినిమాను బాక్సాఫీసును బొనాంజాగా నిలబెట్టాయి. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రిమేక్ చేయాలని ఒకరు.. లేదు రైట్స్ అమ్మేసి క్యాష్ చేసుకుందామని మరొకరు వాదన పడుతున్నట్టు టాక్.
అల వైకుంఠపురములో సినిమాను నిర్మాత రాధాకృష్ణతో కలిసి అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తాన్ని ఇచ్చి రిమేక్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందట. త్రివిక్రమ్, రాధాకృష్ణ ఆ నిర్మాణ సంస్థకు అల వైకుంఠపురములో సినిమా రిమేక్ రైట్స్ ను అమ్మాలని భావిస్తున్నారట. అయితే అల్లు అరవింద్ మాత్రం రిమేక్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాడట.
అల వైకుంఠపురములో రిమేక్ లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఉత్సాహం చూపుతున్నాడట. దీంతో అల్లు అరవింద్, సల్లూభాయ్ తో రిమేక్ చేసిన బిగ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడట. దాంతో రిమేక్, రైట్స్ విషయంలో నిర్మాతల మధ్య సైలెంట్ వార్ నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ మాత్రం బీటౌన్ కు కథ ఎక్కుతుందో లేదో అని భారీ మొత్తానికి రైట్స్ అమ్మేసి క్యాష్ చేసుకుందామని అల్లు అరవింద్ ని కాకాపడుతున్నాడట. మరి రిమేక్ చేస్తారా.. అమ్మేస్తారా అనేది త్వరలో తేలిపోనుంది.