దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చిన జాను...?
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన జాను సినిమాకు తెలుగులో హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పటికే 96 సినిమాను చాలామంది ఆన్ లైన్ లో చూసేయటం తమిళ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు పెద్దగా మార్పులు చేర్పులు లేకపోవటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. తమిళంలో 96 క్లాసిక్ గా మిగిలిపోగా తెలుగులో జాను మాత్రం సాధారణ సగటు తెలుగు చిత్రంగా మిగిలిపోవడం గమనార్హం.
జాను సినిమా నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోలేకపోయిన జాను వీక్ డేస్ కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జాను సినిమాకు చాలా చోట్ల థియేటర్ల రెంట్లు కూడా రావడం లేదని తెలుస్తోంది. రేపు విడుదల కాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్ కు హిట్ టాక్ వస్తే మాత్రం జాను సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లే అని చెప్పవచ్చు.
ఏ సెంటర్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమా కావడంతో జాను సినిమాను బీ సీ సెంటర్ల ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోవడం కూడా సినిమాకు మైనస్ గా మారింది. మొదటి వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్లు 2 లక్షల డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయంటే జాను సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ బయ్యర్ ఈ సినిమాతో భారీ నష్టాలు మూటగట్టుకున్నాడనే చెప్పాలి.
నిజానికి జాను సినిమాను దిల్ రాజు తక్కువ రేట్లకే విక్రయించాడు. తక్కువ రేట్లకే విక్రయించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు మాత్రం భారీగా నష్టాలు తప్పటం లేదు. దిల్ రాజు తన రెగ్యులర్ బయ్యర్లకే జాను సినిమాను అమ్మడంతో మరో సినిమాతో ఈ నష్టాలను భర్తీ చేస్తానని హామీ చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు కెరీర్లో మొదటి రీమేక్ భారీ నష్టాలను మిగల్చటంతో పింక్ రీమేక్ తోనైనా దిల్ రాజు హిట్ కొడతాడో లేదో చూడాల్సి ఉంది.