గతంలో హిట్ ఇచ్చిన వాళ్లతో సాయిపల్లవి..!
టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవికి హిట్ కావాలి. దీని కోసం ఒక చిట్కా.. ఒక రకంగా సెంటిమెంట్ ను ఫాలో అవుతోంది. గతంలో ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్లకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో ఆల్ రెడీ చేసిన హీరోతోనే మరోసారి ఆడిపాడుతోంది సాయిపల్లవి.
ఫిదా.. ఎంసీఏ లాంటి హిట్స్ తో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి కణం.. పడి పడి లేచె మనసు లాంటి ఫ్లాప్స్ తో మరోసారి వెనుకబడిపోయింది. ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ. రానాతో విరాఠపర్వం..చేస్తోంది. నాగచైతన్యతో జత కట్టడానికి కారణం మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫిదా లాంటి సూపర్ హిట్ తో తెలుగులోకి పరిచయం చేసిన దర్శకుడు కావడంతో.. లవ్ స్టోరీతో మరో హిట్ ఇస్తాడన్న నమ్మకంతో ఉంది సాయిపల్లవి.
సాయిపల్లవి నానీతో మరోసారి జత కడుతుందన్న వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎంసీఏ సూపర్ హిట్ అయింది. అప్పట్లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ ఎంసీఏకు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి.
నాని విలన్ గా నటించిన వి మార్చి 25న రిలీజ్ అవుతోంది. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న టక్ జదీష్ ఈ మధ్యనే మొదలైంది. ఆ తర్వాత టాక్సీ వాలా ఫేం రాహుల్ సంకృత్యయాన్ దర్శకత్వంలో నటిస్తాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి అయితే బాగుంటుందని.. దర్శకుడు ఆమెను సంప్రదించి కథ వినిపించాడని తెలుస్తోంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియకున్నా.. కలిసొచ్చిన నాని కోసం ఒకే చెప్పే అవకాశముంది.
మొత్తానికి సాయిపల్లవి శేఖర్ కమ్ములను గట్టిగా నమ్ముతోంది. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన దర్శకత్వంలో పనిచేస్తే హిట్ ఖాయమనే భావనలో ఉంది సాయిపల్లవి.తొలుత హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి.. మధ్యలో ఫ్లాప్ లు చవిచూసింది. ఇపుడు మళ్లీ ఆమె హిట్ కోసం ఆరాటపడుతోంది.