తనజీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని షేర్ చేసిన ఉపాసన!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండటం అందరికి తెలిసినదే. తన ఫాలోవర్స్‌కు ఆమె మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంటారు. అదే విధంగా తన వ్యక్తిగత విషయాల్ని కూడా షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఉపాసన తనకు సంబంధించిన, అంటే తనజీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని(స్వీట్ మెమోరీని) షేర్ చేశారు. సాధారణంగా ఇలాంటి ఘటన చాలా కొంతమందికి మాత్రం జీవితంలో ఎదురవుతూ ఉంటుంది.
అది ఏంటంటే.. ఉపాసన వద్దకు ఓ డాక్టర్ వచ్చి కలిశారు. అంతేకాదు ఆమె సూటిగా ఉపాసనకు ఓ ప్రశ్న కూడా వేశారు. ‘నేను ఎవరో నీకు తెలుసా ’ అంటూ ఉపాసనను క్వశ్చన్ చేశారు. దీంతో షాక్ తిన్న ఉపాసనకు ఆమె బదులుకూడా ఇచ్చారు. ‘నా పేరు డాక్టర్. సి. సరస్వతి.. నిన్ను పుట్టించిన డాక్టర్ నేనే అంది’. ఆ డాక్టర్ అలా చెప్పగానే... ఉపాసన ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే కాదు సూపర్.. నేను ప్రపంచంలోకి రాగానే నన్ను మొట్టమొదట చూసిన వ్యక్తిని నేను కలవడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నానని ఉపాసన ట్వీట్ చేసింది.
ఇలా తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలను, జ్ఞాపకాలను షేర్ చేయడంలో ఉపాసన ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన 7వ మ్యారేజ్ అనివర్సరీ సందర్భంగా దక్షిణాఫ్రికా వెళ్లారు. దక్షిణాఫ్రికా అడవుల్లో పర్యటనకు వెళ్లినప్పుడు రామ్ చరణ్ కెమెరాతో చిరుత పులి ఫోటో తీస్తున్న సమయంలో రామ్ చరణ్ ని చిత్రీకరించింది ఉపాసన. ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆ పర్యటన పై ఉపాసన స్పందిస్తూ.. అడ్వెంచర్ స్పోర్ట్, డైవింగ్, హీలింగ్ టెక్నిక్స్.. ఇలా ప్రతి పెళ్లి రోజునా ఏవో కొత్త విషయాలను ఇద్దరమూ నేర్చుకుంటూనే ఉంటాం” అని రాశారు.
అలాగే... తాజాగా సానియా చెల్లికి, అజార్ తనయుడికి పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది వచ్చారు. అందులో రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసారు కూడా. దానికి సంబంధించిన ఓ వీడియోను అప్పుడు ఉపాసన షేర్ చేసింది. అది కాస్తా అపుడు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో సానియాతో కలిసి డాన్స్ చేస్తున్నాడు చరణ్. దీన్నే రాకింగ్ ది డాన్స్ ఫ్లోర్ అంటారంటూ పోస్ట్ చేసింది ఉపాసన.