ఈసంక్రాంతికి చివరి సినిమా గా విడుదలైన చిత్రం కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా .. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో రెండు వారాలు కూడా కాకముందే థియేటర్లలో నుండే లేపేశారు . దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఫుల్ రన్ లో ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5.62కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది.
శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా , శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక కృష్ణ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గత ఏడాది 118తో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ కు తాజాగా ఎంతమంచివాడవురా షాక్ ఇచ్చింది. ఈసినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు.
ఎంత మంచివాడవురా వసూళ్ల వివరాలు :
నైజాం - 1.3 కోట్లు
సీడెడ్ - 0.78 కోట్లు
ఉత్తరాంద్ర - 0.75 కోట్లు
గుంటూరు - 0.5 కోట్లు
తూర్పు గోదావరి - 0.82 కోట్లు
పశ్చిమ గోదావరి - 0.58 కోట్లు '
కృష్ణా - 0.48 కోట్లు
నెల్లూరు - 0.2 కోట్లు
తెలు గు రాష్ట్రాల్లో మొత్తం షేర్ = 5.42 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్ = 0.2 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ = 5.62 కోట్లు