మహేష్‌కి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా కథ వింటే పవన్‌కి నిద్రొచ్చిందా?
మహేష్‌కు కథ నచ్చి ఆయన చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో తరుణ్‌తో నువ్వే నువ్వే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసుకుని అతడు సినిమాకి ప్లాన్ చేసుకున్నాడు మాటల మాంత్రికుడు. అలా పవన్ మిస్ చేసుకున్న సినిమాను మహేష్ బాబు కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాను అందుకున్నాడు. ఏదేమైనా కూడా అతడు లాంటి స్క్రిప్ట్ చెబుతుంటే పవన్ పడుకోవడం మాత్రం నిజంగానే విడ్డూరంగా ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు పవన్‌తో చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే అతడు పవన్కన్నా కూడా మహేష్ కు బాగా సెట్ అయింది. మహేష్ మ్యానరిజమ్స్‌కి ఆ మూవీ కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందులో మహేష్‌కి కొన్ని సీన్లలో చాలా స్లో డైలాగ్స్ ఉంటాయి. చాలా రిజర్వడ్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో పవన్‌ను చూడటానికి ఆయన ఫ్యాన్స్ పెద్దగా ఇష్టపడరనే వాదనలు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి.