శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీకి బ్రేకులు..!

NAGARJUNA NAKKA

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి. పూరీ సినిమా ఫైటర్ లో విజయ్ దేవరకొండతో జత కడుతోందంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. జాన్వి ప్లేస్ ను మరో బాలీవుడ్  హీరోయిన్ భర్తీ చేస్తోంది. విజయ్ తో జతకట్టే ఆ హిందీ అమ్మాయి ఎవరో తెలుసా..


విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని.. సౌత్ లో నటించాల్సి వస్తే.. విజయ్ దేవరకొండే ఫస్ట్ ఛాయిస్ అంటూ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన జాన్వీనే.. హీరోయిన్ గా తీసుకున్నాడు పూరీ. అయితే.. హిందీలో వరుస కమిట్ మెంట్స్ రీత్యా.. ఫైటర్ కు డేట్స్ ఇవ్వలేకపోయింది జాన్వి. దీంతో విజయ్ దేవరకొండతో నటించాలన్న డ్రీమ్ తీరలేదు. 

 

ఫైటర్ షూటింగ్  అట్టహాసంగా ప్రారంభమైంది.  హీరోయిన్ గా బాలీవుడ్ క్యూట్ అండ్ గ్లామర్ అనన్య పాండే పేరు వినిపిస్తోంది. ప్రముఖ హిందీ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య గత ఏడాది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ ఓ మూవీలో నటించగా.. ప్రస్తుతం కాలా పీలి అనే మరో హిందీ మూవీ చేస్తోంది. 

 

కొత్త హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్న పూరీ.. ఈ సారి బాలీవుడ్ భామ అనన్యను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కొడుకు ఆకాశ్ తో నిర్మిస్తున్న చిత్రం రొమాంటిక్ తో కేతిక శర్మ సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. మొత్తానికి శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ మిస్ అయింది. ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇపుడు మరో బాలీవుడ్ భామ విజయ్ తో కలిసి నటిస్తోంది. చూడాలి మరి.. అనన్య.. విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎలా ఉంటుందో.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: