నిశ్శబ్దం కు బరువైపోయిన అనుష్క !

Seetha Sailaja

సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి అయిన తరువాత అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ జనవరి 31న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు ఊహించిన స్థాయికన్నా ఎక్కువ బడ్జెట్ అవ్వడంతో ఇప్పుడు ఈ మూవీని భారీ రేట్లకు అమ్మవలసి వస్తున్న నేపధ్యంలో అంత భారీ మొత్తాలకు పండగ హడావిడి పూర్తి అయిన తరువాత విడుదల కాబోతున్న ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేస్తున్నట్లు టాక్. 

ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో తీయడమే కాకుండా ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాల ఖర్చు పెట్టవలసి వచ్చింది అని అంటున్నారు. దీనికి కారణం అనుష్క బాడీ షేప్ అని అంటున్నారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ లో మరీ లావుగా మరికొన్ని సీన్స్ లో ఒక మోస్తరు లావుగా కనిపించడంతో ఆమెను సినిమా మొత్తంలోని అన్ని సీన్స్ లోను ఒకేలా చూపించడానికి విజువల్ ఎఫెక్ట్స్ కోసం అదేవిధంగా డిజిటల్ కరక్షన్స్ కోసం చాల ఎక్కువ ఖర్చు పెట్టవలసి వచ్చింది అన్న వార్తలు ఉన్నాయి. 

ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుష్క కంటి కింద ఏర్పడ్డ చారలు తొలిగించదానికి చేసిన డిజిటల్ కరక్షన్ కు కూడ చాల ఖర్చు అయింది అని అంటున్నారు. దీనితో ఈ సినిమాలో నటించినందుకు అనుష్క కోరిన భారీ పారితోషికం ఇవ్వడమే కాకుండా ఆమె విజువల్ ఎఫెట్స్ కోసం చేసిన ఖర్చు అంచనాలను మించి పోవడంతో ఈ సినిమాకు మార్కెటింగ్ సమస్యలు ఎర్పద్దాఇఅని అంటున్నారు. 

దీనితో రానున్న రోజులలో అనుష్కను భరించాలి అంటే ఆమె భారీ పారితోషికంతో పాటు ఆమె విజువల్ ఎఫెట్స్ కోసం కూడ నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ అంజలీ షాలినీ పాండేతో పాటు ఇంకా చాలామంది నటీనటులు నటించడంతో ఈ మూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: