ఆ సినిమా హీరోతో తెలుగు సినిమా.. ఎవరి సినిమాలో చూడండి..

Satvika

మన తెలుగు సినిమాలకన్నా ఏ హాలీవుడ్ సినిమాలో, బాలీవుడ్ సినిమాలో తెరమీద ఎక్కువకాలం ఉంటాయన్న విషయం తెలిసిందే. మన తెలుగులో  కూడా పాన్ ఇండియా రేంజులో హీరోలు ఉన్న కూడా సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వడం లేదన్న విషయం తెలియసిందే. అందుకే సినిమాలను ఎంతో  చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చిన కూడా సినిమాలకు పెద్ద డిమాండ్ లేదని అర్థమవుతుంది. ఏ రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు ఈ సినిమాలను తీస్తేనే కొద్దీ రోజులు ఆడటమే కాకుండా ప్రపంచ స్థాయి  గుర్తింపు కూడా తెచ్చుకుంటాయ్. 

 

ఇంకా వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామోరూన్ తెరకెక్కించిన అవతార్ సినిమా గురించి అందరికి తెలిసిందే. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్నికావు, ఆ జంతువులు ఆ ప్రాంతం.. అంత సినిమా చూస్తున్నంత సేపు కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటాయి. ఆస్కార్ తో సహా అన్ని అవార్డులు సొంతం చేసుకుంది ఈ సినిమా, టైటానిక్ సినిమా తర్వాత ఆ రేంజులో ఆదరణ, అవార్డులు దక్కించుకున్న సినిమా అవతార్.

 

టైటానిక్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన సృష్టి కర్తనే అవతార్ అనే అద్భుతాన్ని సృష్టించడం విశేషం. కాగా ఈ సినిమాలో నటించిన నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. త్వరలో అవతార్ 2 కూడా ప్రారంభం కానుంది. 
ఈ విజువల్ వండర్ లో హైదరాబాద్ కు చెందిన ఓ నటుడు నటించడం మనకు దక్కిన గౌరవం. కాగా అవతార్ లో నటించిన నటీనటులతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కుతుంది.

 

రీల్ కట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నరేన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 19న షూటింగ్ లడాఖ్ లో ప్రారంభించనున్నారు. అమెరికా- యూకే- బ్రెజిల్- మలేషియాకు చెందిన నటీనటులు ఇందులో నటిస్తున్నారు. సినీ ప్రియులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుందని చిత్రయూనిట్ చెప్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: