రాజమౌళిని ఆకర్షించిన హ్యాపీ ఆర్ ఆర్ ఆర్ ఇయర్ పోస్టర్ !

Seetha Sailaja

2020 కు స్వాగతం పలుకుతూ ఎవరైనా ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ శుభాకాంక్షలు తెలియచేసే సందేశాలు ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఒక వీరాభిమాని చరణ్ జూనియర్ ల అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల గెటప్స్ లో ఉన్న చరణ్ జూనియర్ ఫోటోలను క్రియేట్ చేసి ‘హ్యాపీ ఆర్.ఆర్.ఆర్ ఇయర్’ అంటూ షేర్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆ పోస్టర్ పై వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రాబోతున్న జనవరి ఫస్ట్ న విడుదల అవుతుంది అని అందరు భావించారు. అయితే అటువంటి సూచనలు ఏమి రాజమౌళి టీమ్ నుండి రావడం లేదు. దీనికి కారణం ఈమూవీ టైటిల్ విషయంలో కొనసాగుతున్న కన్ఫ్యూజన్. 

ఇలాంటి పరిస్థితులలో ఒక వీరాభిమాని ఆలోటును పూడ్చడానికి ఇలా తన క్రియేటివిటీ తో ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను క్రియేట్ చేసి తనకు తానుగా అందరికీ ‘ఆర్ ఆర్ ఆర్’ తరఫున శుభాకాంక్షలు తెలియచేసి రాబోయే సంవత్సరానికి ‘ఆర్ ఆర్ ఆర్’ సంవత్సరంగా నామకరణం చేసాడు. ఇప్పుడు ఈ పోష్టర్ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో ఆ వీరాభిమాని క్రియేటివిటీని అభినందిస్తూ తన టీమ్ చేత ఒక ట్విట్ చేయించాడు. 

ఇది ఇలా ఉంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి ఈ మూవీ క్లైమాక్స్ ను ఎలా తీయాలి అన్న కన్ఫ్యూజన్ రాజమౌళికి మొదలైంది అని టాక్. అదేవిధంగా ఈమూవీకి సంబంధించి ఇంట్రవెల్ ట్విస్ట్ సీన్ విషయమై కూడ రాజమౌళికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని దీనితో ఈ రెండు విషయాలను రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చాల లోతుగా చర్చలు జరుపుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: