విజయ్ దేవరకొండకు తల్లిగా సీనియర్ హీరోయిన్.. !

NAGARJUNA NAKKA

బాహుబలిలో ప్రభాస్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణ.. త్వరలో ఓ క్రేజీ హీరోకు మదర్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో.. బాహుబలితో ఇండియా వైడ్ పాపులర్ అయిన రమ్యకృష్ణను సెలక్ట్ చేశాడు దర్శకుడు. ఇంతకీ ఈ సీనియర్ హీరోకు తల్లిగా నటిస్తుందో తెలుసా.. !

 

హీరోయిన్ గా కొన్ని వందల సినిమాలు చేసిన రమ్యకృష్ణ. సీనియర్ స్టార్స్ అందరితో వరుస సినిమాలు చేసింది. హీరోయిన్ గా ఎన్ని హిట్స్ ఉన్నా రాని గుర్తింపు బాహుబలిలో శివగామి పాత్ర తీసుకొచ్చింది. బాహుబలి ఇండియన్ స్క్రీన్ పై వెలిగిపోయిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత ఆ స్థాయిలో క్రేజీ తీసుకొచ్చిన సినిమా ఒక్కటీ రాలేదు. అయితే సైన్ చేసిన చిత్రాలు మరోసారి గుర్తింపు తీసుకొస్తాయన్న నమ్మకంతో ఉంది ఈ సీనియర్ హీరోయిన్. 

 

ఇప్పట జనరేషన్ స్టార్ ప్రభాస్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణ త్వరలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ మదర్ గా కనిపించనుంది. పూరీ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ మూవీలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ లో పోషిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే.. విజయ్ తో తీసే మూవీ ఫైటర్ లో రమ్యకృష్ణను తీసుకున్నాడు పూరీ. అర్జున్ రెడ్డితో అగ్రెసివ్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మదర్ గా పవర్ ఫుల్ యాక్ట్రెస్ నటించనుంది. 

 

రమ్యకృష్ణ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కృష్ణ వంశీ డైరెక్ట్ చేసే రంగమార్తాండ మూవీలో ప్రకాశ్ రాజ్ భార్యగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పూరీ సినిమాలు రొమాంటిక్, ఫైటర్ లో నటిస్తోంది. సీనియర్ హీరోలతో ఆడిపాడిన రమ్యకృష్ణ... ఇప్పటి స్టార్స్ మదర్ రోల్స్ కు మెయిన్ ఆప్షన్ అయిపోయింది. మొత్తానికి రమ్యకృష్ణ మరోసారి తల్లి పాత్రలో మైమరపించనుంది. పైగా విజయ్ దేవరకొండకు తల్లిగా నటించనుండటంతో ఆ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ సినీ లవర్స్ లో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: