వేడుకగా  నేషనల్‌ అవార్డ్స్‌ ప్రధానోత్సవం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీద అవార్డుల ప్రదానం..

Suma Kallamadi

తాజాగా జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్‌ అవార్డ్స్‌ ప్రధానోత్సవ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం సినీ పరిశ్రమలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నటీనటులు సాంకేతిక నిపుణులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీద అవార్డుల ప్రధానం చేయడం జరిగింది.

 

ఇక ఈ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన విజేతల వివరాలను ఈ సంవత్సరం ఆగస్టులోనే ప్రకటించడం జరిగింది. కానీ ఆ అవార్డులను మాత్రం ఇప్పుడు ప్రధానం చేయడం జరిగింది. ఇక విజేతల వివరాలు ఇలా  ఉత్తమ చిత్రంగా గుజరాతి సినిమా హెల్లర్‌ కు అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో భాగంగా రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిలసౌ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది.

 

 

ఈ సంవత్సరం ఉత్తమ నటిగా దక్షిణాది భామ  కీర్తి సురేష్‌ అవార్డును సొంతం చేసుకోవడం చాల విశేషం. అలనాటి అందాలనటి సావిత్రి జీవిత చరిత్రగా రూపొందిన మహానటి సినిమాలో అద్భుతంగా నటించి అందరి ఆదరణ పొందిన కీర్తి సురేష్‌ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఒకేసారి  తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవ్వడంతో మహానటి ఘన విజయం సాధించటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను కూడా సొంతం చేసుకుంది అన్న మాటకు ఎటువంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన ఫిలింఫేర్‌ అవార్డ్స్‌లోనూ కూడా మహానటిగా కీర్తి సురేష్‌  సత్తా చాటడం చాల విశేషం.

 

 

ఇక ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరు యంగ్ హీరోలకు రావడం చాలా విశేషం. ఇక  భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో రూపొందిన ఉరి సినిమాలో నటించిన విక్కీ కౌషల్‌తో పాటు అంధాదున్‌ సినిమాలో నటించిన ఆయుష్మాన్‌ ఖురానాలకు సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడుగా రంగస్థలం సినిమాకు గానూ రామ్‌ చరణ్‌కు అవకాశం వస్తుంది అని అందరు అంచనా వేయడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: