ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎంచేస్తున్నాడో తెలుసా..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు కోపం వచ్చింది.. అది కూడా ఒక నిర్మాత పైన.. అసలు విషయం ఏమిటంటే .. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. మరో వైపు ప్రొడ్యూసర్ గా తన తండ్రి సినిమాల ను నిర్మిస్తూ పనులన్ని చూసుకుంటున్నాడు.
ఈ నేపథ్యం లో చరణ్ రాజమౌళి సినిమా తప్ప మరొకటి ఒకే చేయలేదు. పూర్తి దృష్టి ఆర్.ఆర్.ఆర్ పైనే పెట్టాడు. ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించనున్నాడు.ఈ నేపథ్యం లో ఓ ప్రముఖ దర్శకుడు తాను హైదరాబాద్ లో ఉన్న సమయం లో వచ్చి కథ వినిపించే ప్రయత్నం చేయగా… వద్దని చెప్పారట. రామ్ చరణ్ కోసమే రూపొందించిన పాత్ర అది అని… యాక్షన్ కథ, మాఫియా చుట్టూ తిరుగుతుందని చెప్పారట. దీనికి రామ్ చరణ్ అంగీకరించలేదట. ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాను కంప్లీట్ చేయాలి.
దాంతో పాటే మెగాస్టార్ ,కొరటాల సినిమాను నిర్మించాలి. చాలా పనులుండటం తో చరణ్ నో చెప్పాడంట.అయితే తనకుసన్నిహితం గా ఉండే ఒక నిర్మాత చేత ఆ దర్శకుడు అల్లు అరవింద్ కు చెప్పాడట చరణ్ ను ఎలాగై నా ఒప్పించండి అని, ఆ తరువాత అరవింద్ చిరంజీవి చెప్పాడట .. దాంతో చిరు చరణ్ కు ఫోన్ చేసి మాట్లాడంట ..దాంతో రామ్ చరణ్ కు చిర్రెత్తుకొచ్చింది.. నాతో మాట్లాడొచ్చు కదా అరవింద్ చెప్తే చేస్తానా…? ఇప్పట్లో చేయలేను అని చెప్పేశాడట. గత కొంతకాలం గా చరణ్ కు అల్లు అరవింద్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. దాని కారణంగానే నిర్మాత పైన చరణ్ సీరియస్ అయ్యాడని తెలుస్తుంది.