హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020 : నానికి క్రేజ్ తగ్గిపోతుందా.?
ఆ హీరో నటనలో అసలు సిసలైన నాచురాలిటీ.. ఆయన కామెడీ టైమింగ్ లో ఉంటుంది పంక్చువాలిటీ.. ఆయనే నాచురల్ స్టార్ నాని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో ఒకరు నాచురల్ స్టార్ నాని. 2008 అష్టా చెమ్మ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో నాని ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోయారు. అయితే కెరియర్ ప్రారంభించినప్పటి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు హీరో నాని. తర్వాత ప్రేక్షకులందరికీ నాచురల్ స్టార్ గా మారిపోయాడు. నాచురల్ యాక్టింగ్ తో హావభావాలను పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయాడు నాని.
ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. కొన్ని సినిమాల్లో భారీ విజయాలు సాధిస్తే స్టార్ హీరోల రేసులో నాచురల్ స్టార్ నాని చేరబోతున్నాడు అని అనుకుంటున్న తరుణంలో... నానికి ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. విభిన్నమైన కథాంశం తో సినిమాలను చేసుకుంటూ అందరినీ అలరిస్తూ వరుసగా 9 సినిమాలు విజయాలతో దూసుకుపోయిన నానీ.. తర్వాత రొటీన్ బాటలో పడడంతో నానికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గి పోయింది. ఎప్పుడైతే కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో రొటీన్ సినిమా చేశాడో ఇక అప్పటినుంచి నాని సినిమాలు హిట్ సాధించలేకపోతున్నాయి .
వరుస హిట్లతో దూసుకుపోతున్న నానికి కృష్ణార్జున యుద్ధం సినిమా డిజస్టార్ భారీ షాక్ ఇచ్చినదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత నాగార్జున లాంటి స్టార్ హీరో తో నటించి దేవదాసు సినిమా చేసినప్పటికీ... టాక్ పరంగా ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్గా మాత్రం అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక ఈ ఏడు తాజాగా విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా కథ పరంగా.. నటన పరంగా నానికి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నా... కమర్షియల్గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా క్లిక్ కాలేకపోయింది ఈ సినిమా. కెరియర్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన సినిమాలు కమర్షియల్ గా హిట్ సాధించలేకపోతున్నాయని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్న మాట. గ్యాంగ్ లీడర్ లాంటి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. భారీ వసూలు రాబట్టకపోడానికి కారణం సరైన ప్లానింగ్ చేయకపోవడమే అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నాని తన తర్వాతి సినిమాల్లో ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లు కూడా రాబట్టే అవకాశం ఉంది.