పవన్ మోజుపడ్డ సినిమా వెంకటేష్ ఇంట వాలింది!

Seetha Sailaja
పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారిల్లు’ విడుదల కాక ముందు పవన్ బాలీవుడ్ లోమంచి పేరు తెచ్చుకున్న పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై గాడ్'. సినిమాను తెలుగు లో పవన్ రీమేక్ చేస్తాడు అంటు చాల గట్టిగా వార్తలు వచ్చాయి. ‘అత్తారిల్లు’ సూపర్ హిట్ తరువాత పవన్ మనసు ‘గబ్బర్ సింగ్ -2’ సీక్వెల్ పై పడడంతో ‘ఓమైగాడ్’ వెనక్కు వెళ్ళింది  పవన్ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన శ్రీకృష్ణుడు పాత్రను వెరైటీగా చేద్దామను కున్నాడు. అప్పట్లో ఈ సినిమాను పవన్ ప్రత్యేకంగా షో వేయించుకుని చూసాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని వెంకీ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఫిభ్రవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది అని అంటున్నారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. రీమేక్ లు అంటే విపరీతమైన మమకారం ఉండే వెంకటేష్ ప్రస్తుత తన వయస్సుకు ఈ పాత్ర సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడట.  ఈ సినిమాకు ‘తడాఖా’ దర్శకుడు డాలీ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారామ్. 'కంజి విరుద్ధ్‌ కంజి' అనే గుజరాతి నాటకం ఈ చిత్రానికి ఆధారం. వెంకటేష్ కు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదు. అందువల్ల తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుని కనీసం వచ్చే సంవత్సరమైనా తన కెరియర్ ను ఒక ట్రాక్ లో పెట్టుకోవడానికి వెంకటేష్ ఇలాటి వెరైటీ పాత్రలను ఎంచుకున్నట్లు గా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: