వారెవ్వా బాలయ్య మామూలోడు కాదు.. దబిడి దిబిడే...
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ రొమాంటిక్ కమర్షియల్ చిత్రం రూలర్. ఇప్పటికి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్లు, సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోను, సినీ ఇండస్ట్రీలోను, అటు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది.
అసలు విషయానికొస్తే.. బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, భూమిక చావ్లా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నిర్మాత సి.కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం బాలయ్య 105 వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇకపోతే బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్ గా మరియు డాన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఆ విధంగా అభిమానులను పూర్తిగా నిరాశ పరిచిన బాలకృష్ణ, ప్రస్తుతం తెరకెక్కుతున్న రూలర్ తో ఎంత మేరకు మెప్పిస్తాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
కాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాని క్రిస్మస్ కానుక గా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సాయంత్రం ఈ చిత్ర బృందం విశాఖలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటుగా నందమూరి అభిమానులు కూడా భారీగా వస్తారని అంచనా.. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.