షూటింగ్ లో దర్శకుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుదీర్..నిజం బయటపెట్టిన హీరోయిన్
సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో సాదాసీదా కమెడియన్ లా ఎంట్రీ ఇచ్చి... తర్వాత అక్కడ తన టాలెంట్ నిరూపించుకుని ఏకంగా టీం లీడర్ గా ఎదిగాడు. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయిపోయాడు సుధీర్. ప్రస్తుతం జబర్దస్త్ ఏ కమెడియన్ కి లేనంత క్రేజ్ సంపాదించి దూసుకుపోతున్నారు సుధీర్. ఓన్లీ జబర్దస్త్ లో కామెడీ తోనే కాకుండా ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ లో అందరి కమెడియన్స్ లా కామెడీ కే పరిమితం అయిపోకుండా వివిధ కార్యక్రమాలలో యాంకరింగ్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు. అంతేకాదు తన మ్యాజిక్ షో లతో కూడా అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు సుడిగాలి సుధీర్. మరోవైపు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఇరగదీస్తున్నాడు .
ప్రస్తుతం ఏకంగా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుడిగాలి సుదీర్. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ సరసన రాజు గారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు సుడిగాలి సుదీర్ తన డాన్సులతో అదరగొట్టేశాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా హీరో సుడిగాలి సుదీర్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది హీరోయిన్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ. సినిమా షూటింగ్ సమయంలో సుడిగాలి సుదీర్ చాలా సీరియస్ గా ఉండేవాడిని ధన్య బాలకృష్ణ తెలిపింది. ఓ రోజు షూటింగ్ లో చాలా లేట్ అయ్యేసరికి షూటింగ్ లో చాలా గందరగోళం సృష్టించాడు అంటూ చెప్పుకొచ్చింది. ఏకంగా దర్శకుడి మీద సుధీర్ చిందులు వేసాడని గందరగోళం సృష్టించాడని అంటూ ధన్య బాలకృష్ణ చెప్పుకొచ్చింది. హీరోయిన్ చెప్పినట్టుగానే వినండి అంటూ సుడిగాలి సుదీర్ షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు అంట ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ధన్య బాలకృష్ణ. అయితే ధన్య బాలకృష్ణ కామెంట్స్ నీ పక్కనే ఉన్న సుడిగాలి సుదీర్ మాత్రం కొట్టిపారేశారు.