కాజల్ పెళ్లి విషయంలో ఫ్యామిలీలో గొడవ..?
మూడున్నర పదుల వయస్సు దాటిని సరే ఇంకా సినిమాలు చేస్తూ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తూ దూసుకు పోతోంది మెరుపు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఓ వైపు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోలకు ఇటు బెల్లంకొండ లాంటి కుర్ర హీరోలకు కూడా మంచి ఆప్షన్ గా కాజల్ కనిపిస్తోంది. ఎప్పుడో దశాబ్దంన్నర క్రిందట కెరీర్ స్టార్ట్ చేసిన కాజల్ జోరు తగ్గినా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉంది.
ప్రస్తుతం మెగాస్టార్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కే చిరు 152వ సినిమాకు సైతం ఆమె పేరే హీరోయిన్ గా పరిశీలనలో ఉంది అంటే కాజల్ క్రేజ్ ఈ వయస్సులో కూడా ఎలా ఉందో ? అర్థమవుతోంది. ఇక ఇటీవల తన పాత పరిచయాలను వాడుకుంటూ ఆమె ఛాన్సుల ఎలాగోలా దక్కించు కుంటూనే ఉంది. ఇక ఇటీవల కాజల్ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వస్తున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసు కోవాలన్న ఆలోచనతో ఉన్నా కాజల్ ఇంత వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోకుండానే కాలం గడుపుతోంది. పెళ్లి విషయంలో మాత్రం ఆమె ఇంట్లో వాళ్లకు ఎలాంటి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. కొద్ది రోజుల క్రితమే ఆమె ముంబైకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సంగతేమో గాని ఇప్పుడు ఆమె పెళ్లి విషయం కాజల్ ఫ్యామిలీలో గొడవకు కారణం అయిందనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఆమె తల్లి... పెళ్లి విషయంలో కాజల్ తో గొడవ పడ్డారని... ఆమె హైదరాబాద్ లో సొంతగా ఫ్లాట్ తీసుకుని ఉన్నారని.. కొంత కాలం ఆమె కుమార్తె దగ్గరకు కూడా వెళ్లడం లేదన్న టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో గాని .. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్.