చిన్న గౌను వేసుకున్న పెద్ద నటి.. వైరల్ అవుతున్న పిక్
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సినీ నటిగా, వివాదాలకు దగ్గరగా ఆమె సినీ పయనం కొనసాగింది. అప్పడప్పుడూ కొన్ని సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలోనే ఆమె ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. వయసు ఎక్కువైనా ఫ్యాషన్ పై మక్కువ తగ్గని నీనా డ్రెస్సింగ్ పై ఎక్కువగా శ్రద్ధ పెడుతూంటుంది. ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన తన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆమెపై అనేక విమర్శలు వస్తున్నాయి.
రీసెంట్ గా నీనా ఓ పొట్టి గౌను వేసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. వయసు 60కి వచ్చినా ఇలాంటి పొట్టి డ్రెస్ వేయటం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. మోకాలి పైవరకూ కనిపించేలా పొట్టి గౌను వేసుకుని దిగిన ఫొటో అది. దీనికి క్యాప్షన్‌గా.. ‘ఫ్రాక్ కా షాక్.. నా సహ నటుడు గజరాజ్ ఈ ఫొటో తీశారు’ అని రాసుకుంది. ఈ గౌనులో ఉన్న నీనాను చూసి చాలామంది నెటిజన్లు షాకయ్యారు. 60 ఏళ్ల వయసులో కూడా సెక్సీగా ఉన్నారు.. అని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ఎక్కువగా ఆమె నెగటివ్ ట్రోలింగ్ కే గురవుతోంది. ఏ వయసులో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో.., ప్రస్తుతం సమాజంలో అత్యాచారాలు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి తెలీదా.., ఇలాంటి దుస్తులు వేసుకుని రెచ్చగొట్టకు.. వంటి కామెంట్లకు ఆమె గురవుతున్నారు.
నీనా వ్యక్తిగతం గురించి కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. వెస్టిండీస్ మాజీ విధ్వంసకర బ్యాట్స్ మెన్ వీవ్ రిచర్డ్స్, నీనా గుప్తా లవ్ స్టోరీ అప్పట్లో ఓ సంచలనం. పెళ్లి కాకుండానే నీనా ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివ్ – నీనా మాత్రం పెళ్లి చేసుకోలేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తానే వీరి కూతురు.
auto 12px; width: 50px;">View this post on InstagramFrock ka shock. Picture taken by the gajraj sir A post shared by Neena Gupta (@neena_gupta) on