పవనిజమ్ క్రేజ్ తో ప్రస్తుతం పవన్ పేరు ఒక వ్యాపార వస్తువులా మారిపోయింది. ఎవరికి వారు పవన్ పేరును, ఎవరిష్టానికి వాళ్ళు వాడేసుకుంటున్నారు. అయితే చాలా మంది గుర్తింపు కోసం మాత్రమే పవన్ పేరును ఉపయోగించు కుంటూ ఉంటె లేటెస్ట్ గా ఒక మహిళ పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని యాలి గ్రిఫ్ఫిన్స్ అనే ఆవిడా తానూ వ్రాసిన 'ది సెప్టెంబర్ అఫ్ మై ఇయర్స్' అనే పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాను అని ప్రకటించింది. అంతకు మించి ఆ పుస్తకంలో ఏముంది అనే విషయాన్నీ కూడా ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు.
కాని ఇప్పుడు హత్తాతుగా ఆ పుస్తకంలో పవన్ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి అంటే, పుస్తకాన్ని అడ్వాన్సుగా బుక్ చేసుకోండి అంటూ హడావిడి ప్రచారం మొదలుపెట్టిoది. అడ్వాన్సు బుకింగ్ వల్ల లాభాలువివరిస్తూ ఆమె ఆడబ్బులను హెచ్ ఐ వి ఉన్న పిల్లలకు విరాళంగా ఇస్తాం అని చెపుతోంది అని చెప్పుకొచ్చారు. పవన్ పేరు బట్టి ఆ పుస్తకానికి బాగా బుకింగ్ లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని కొన్ని విషయాలు మాత్రం పవన్ అభిమానులకు అనుమానం కలిగిస్తున్నాయట.
నిజంగా పవన్ గురించి ఆ పుస్తకంలో అన్ని విషయాలు ఉంటె, ఒక గ్రాండ్ బుక్ లాంచ్ జరిపితే మార్కెట్ లో ఆ పుస్తకానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని పవన్ అభిమానుల వాదన. ఇంతకి ఈ పుస్తకం ఫై పవన్ ప్రతిస్పందన ఏమిటో తెలియాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: