' సరిలేరు నీకెవ్వరు ' రన్ టైం ఫిక్స్... ఎన్ని నిమిషాలంటే...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు ఈ సినిమా యూనిట్ షూటింగ్ కంప్లీట్ చేస్తూనే... మరోవైపు ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేసింది. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకు పోతూ ఉండడంతో పాటు అటు అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
మహేష్ కెరీర్లో 26 సినిమా తెరకెక్కుతున్న సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించిన ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. చిత్రాన్ని కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచిన అనిల్ రావిపూడి.. మొత్తంగా 2 గంటల 30 నిమిషాల నిడివి ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి సినిమాలు అన్నీ ఇంచు మించు ఇంతే రన్ టైం కలిగి ఉంటాయి.
అనిల్ తాను చెప్పాలనుకున్నది క్రిస్పీగా చెప్పుతారు. అందుకే ఎక్కడా సుత్తి లేకుండా సూటిగా అనిల్ సినిమాల కథ, కథనాలు ఉంటాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా అదే పంథా ఫాలో అయ్యాడట. ఇక సినిమాలో కామెడీ సీన్లు ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేలా డిజైన్ చేశాడట. దశాబ్దం విరామం తర్వాత లేడీ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.
ఇక ఈ సినిమాకు పోటీగా బన్నీ - త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న అల వైకుంఠపురంలో సినిమా కూడా వస్తుండడంతో ఈ రెండు సినిమాల పోటీ టాలీవుడ్‌లో మంచి ఆసక్తిగా మారింది. మరి ఈ పోరులో ఏ హీరో సినిమా పై చేయి సాధిస్తుందో ? చూడాలి.