చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి సినిమా ‘విజేత’ ఫెయిల్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ మెగా అల్లుడు తిరిగి తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెండవసారి ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు పులివాసు దర్శకత్వంలో నటించబోతున్న మూవీకి ‘సూపర్ మచ్చి’ అన్న టైటిల్ పెట్టబోతున్నారు.
ఈనెల 22 నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీకి సంబంధించి వస్తున్న ఒక లీక్ బాలకృష్ణ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీ కోసం హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రచిత రామ్ ను ఎంపిక చేయాలని చాల ప్రయత్నాలు చేసారు.
అయితే ఆమె సున్నితంగా ఆ ఆఫర్ ను తన డేట్స్ ఎడ్జెస్ట్ కావడం లేదు అంటూ బాలయ్య ప్రాజెక్ట్ ను తిరస్కరించింది అన్న వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీకి ఓకె చెప్పడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 100 సినిమాలకు పైగా నటించిన బాలకృష్ణను కాదనీ నటించిన మొదటి సినిమాతోనే ఫెయిల్యూర్ హీరోగా ముద్ర పడిన కళ్యాణ్ దేవ్ ను రచితా రామ్ ఎంచుకోవడం ఒక విధంగా బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేని నిజం.
అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజం కాదనీ రచితా రామ్ కు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న నేపధ్యంలో చిరంజీవి అల్లుడు లాంటి చిన్న హీరోలతో ఆమె నటించదనీ ఇది కేవలం పుకార్లు మాత్రమే అంటూ మరికొందరు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అయితే ఆమె నిజంగా కళ్యాణ్ దేవ్ తో నటిస్తే బాలయ్య అభిమానులకు మాత్రమే కాదు ఆమె కోసం ప్రయత్నాలు చేసిన బోయపాటికి కూడ ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి..