‘బిగ్ బాస్ ౩’ షో ముగిసిపోయి రెండు వారాలు అయిపోతున్నా ఆషో విజేతగా మారిన రాహుల్ పునర్నవిలను లింక్ చేస్తూ వచ్చిన వార్తలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి సాన్నిహిత్యం లేదు కేవలం మంచి స్నేహితులం మాత్రమే అంటూ వీరిద్దరూ ఓపెన్ గా నే చెపుతున్నా వీరిద్దరి మధ్య ఏదోఒక సీక్రెట్ ఉంది అంటూ ఊహా గానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
‘బిగ్ బాస్’ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి వరుణ్ వితిక అలీ రాహుల్ పునర్నవిలు ఒక గ్రూప్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. వీరి గ్యాంగ్ ను అదే విధంగా వీరి రాజకీయాలను బుల్లితెర ప్రేక్షకులు అతిగా ఇష్టపడ్డారు. వాస్తావానికి వరుణ్ వితికలు భార్యాభర్తలు కాబట్టి వారి మధ్య సాన్నిహిత్యం గురించి పెద్దగా ఎవరు అంతగా పట్టించుకోలేదు.
అయితే రాహుల్ పునర్నవిల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసినవారు మాత్రం వీరి మధ్య ఎదో ఒక సీక్రెట్ ఉంది అంటూ ఈషో కొనసాగిన అన్ని రోజులు ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈషో నుండి వీరిద్దరూ బయటకు వచ్చేసినా వీరికి వీరి సాన్నిహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురౌతూనే ఉన్నాయి. దీనితో ఈ రూమర్స్ కు చెక్ పెట్టాలని పునర్నవి ఒక ఎత్తుగడ వేసింది.
లేటెస్ట్ గా ఈమె ఒక నైట్ పార్టీ అలీ హిమజ వితికా వరుణ్ లతో కలిసి ఎంజాయ్ చేసింది. ‘కిస్ మై యాస్’ అంటూ పునర్నవి ఆమె తాగి ఉంది అంటూ వితికా టూ సెక్సీ అంటూ హిమజ ఫ్లకార్డ్ లను పట్టుకుని పోజులు ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ పార్టీలో రాహుల్ కనిపించక పోవడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం పునర్నవి తనకు రాహుల్ తో ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇవ్వడానికి ఈ పార్టీకి ఆమె రాహుల్ ను ఆహ్వానించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..