మరో కొత్త ప్రయోగంలో నాగ్

Seetha Sailaja
నాగార్జున అంటేనే రకరకాల ప్రయోగాలకు చిరునామా. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ,దసరద్ లాంటి దర్శకుల నుండి ఈ నాటి కొత్తతరం దర్శకుల వరకు నాగార్జున తన సినిమాలలో ఎన్నో ప్రయోగాలు చేయడమే కాకుండా కొత్త తరం దర్శకులకు అవకాసం ఇస్తూ తన ఇమెజ్ పెంచుకోవడానికి నిరంతరం తపన పడుతూనే ఉంటాడు నాగ్. నాగార్జున ఈ మధ్య నటిస్తున్న చాల సినిమాలు పరాజయం చెందుతూ ఉన్నా కొత్త హీరోలతో పోటీ పడుతూనే ఉన్నాడు.  నాగ్ లేటెస్ట్ గా నటించబోయే సినిమాలో పాటలు ఉండవని సమాచారo. ‘స్వామి రారా’ చిత్రంతో పరిచయమైన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. రెగ్యులర్ రొటీన్ సినిమాల కన్నా విభిన్నమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా చేయాలని నాగార్జున చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తాడట. ఇప్పటికే ఇదే బేనర్ పై అక్కినేని కుటుంబ కధా చిత్రంగా ‘మనం’ తో పాటు నాగచైతన్యతో కూడా మరో సినిమాను నాగార్జున తీస్తున్నాడు.  బయట బేనర్ల పై చేస్తున్న సినిమాలు తనకు అదృష్టాన్ని ఇవ్వలేకపోవడంతో ఇక ప్రయోగాలన్నీ నాగార్జున తన సొంత బేనరు పైనే చేయబోతున్నట్లు గా తెలుస్తోంది. హీరోయిన్స్ తో స్టెప్స్ లేకుండా కోలీవుడ్ స్టార్స్ అజిత్ లాంటి హీరోలు చేస్తున్న ప్రయోగం నాగార్జున టాలీవుడ్ లో కూడ చేస్తున్నట్లు అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: